అనసూయకు ఫ్యామిలీ సపోర్ట్‌!

Family support for Anasuya!
Spread the love

అనసూయ భరద్వాజ్‌.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై జబర్దస్త్‌ షో ద్యారా యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. తన అందం, అభినయంతో చెరగని ముద్ర వేసుకుని, తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ ఇమేజ్‌ కాస్త తనకు వరుస సినిమా అవకాశాలు కూడా తెచ్చి పెట్టింది. ఇప్పటి వరకు ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘పుష్ప’, ‘ఖిలాడీ’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చివరిగా పుష్ప 2, రాజాకార్‌ వంటి చిత్రాల్లో నటించింది. నెక్స్ట్ పవన్‌ కళ్యాణ్‌ ‘హరి హర వీరమల్లు : పార్ట్‌ 1’ చిత్రంతో అలరించబోతోంది. అలాగే వీటితో పాటుగా ‘ఫ్లాష్‌ బ్యాక్‌’, ‘వోల్ఫ్‌’ అనే చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇక మూవీస్‌ విషయం పక్కన పెడితే వ్యక్తి గతంగా అనసూయ చాలా స్ట్రాంగ్‌ అని చెప్పాలి. ఆమె వస్త్రధారణ పై ఎన్నో ట్రోల్స్‌ వస్తున్న ఎదుర్కొంటూ వారికి తగిన సమాధానం ఇస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ అమ్మడు కెరీర్‌ విషయంలో తన ఫ్యామిలీ సపోర్ట్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ విషయాలు పంచుకుంది..ఇలాంటి బట్టలు వేసుకుంటే ఇంట్లో వారు ఆమెను ఏం అనడం లేదా? అని కొన్ని ప్రశ్నలు సోషల్‌ విూడియా వినిపిస్తున్నాయి వాటి విూద విూ అభిప్రాయం ఏంటని ప్రశ్నించగా.. అనసూయ మాట్లాడుతూ..”ఇంట్లో భార్యగా, కోడలిగా, తల్లిగా, ఒక మహిళగా నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉన్నాను. అందుకే నా కుటుంబం మొత్తం నా వృత్తికి ఎంతో సహకరిస్తారు. నా భర్త సుశాంక్‌ భరద్వాజ్‌ తో తెరపై 15 ఏళ్ల వరకు నా కెరీయర్‌ ఉంటుందని ముందే పర్మిషన్‌ తీసుకున్నా. అనుమతి తీసుకున్న తర్వాతే టెలివిజన్‌ రంగంలో అడుగు పెట్టాను. ఇక డ్రెస్సింగ్‌ విషయంలో నేను నా ఫ్యామిలీ క్లారిటీగా ఉన్నాం’’ అంటూ చెప్పుకొచ్చింది.

Related posts

Leave a Comment