కార్యదీక్షా పరుడు..వివాద రహితుడు కొండపనేని ఉమామహేశ్వరరావు

Kondapaneni Umamaheswara Rao, a man of action... without controversy
Spread the love

* ఏపీ ఎఫ్.డి.సి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌ కొండపనేని
ఉమామహేశ్వరరావుకు ఫిలింక్రిటిక్స్ సత్కారం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం టెలివిజన్ & థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధ్యక్షుడిని కార్యవర్గాన్ని నియమించిన విషయం విదితమే. కాగా అందులో బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ గా సీనియర్‌ పాత్రికేయులు, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్‌ సభ్యుడైన కొండపనేని ఉమామహేశ్వరరావుని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్‌ పాలక వర్గం ఆయనను ఫిలింఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్ బిల్డింగ్‌ నందు శుక్రవారం నాడు ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు జి.ఆదిశేషగిరిరావు, కాజా సూర్యనారాయణ ఆత్మీయ అతిధులుగా పాల్గొన్నారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సురేష్‌ కొండేటి పుష్ఫగుచ్చాన్ని ఇవ్వగా .. సీనియర్‌ సభ్యలు ఎ.బాలిరెడ్డి, కె. వెంకటేశ్వరరావులు శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ … ”అందరికి మంచి స్నేహితుడు, సౌమ్యుడైన ఉమా మహేశ్వరరావు నేను మద్రాసులో నుండి కలిసి ప్రయాణం చేస్తున్నాము. కార్యదీక్షా పరుడైన ఉమా మహేశ్వరరావును ఏపీ ఫిలిం డెవలప్‌ కార్పోరేషన్‌ వారు బోర్డు ఆఫ్‌ డైరెక్టర్‌ పదవి ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నాను. వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అన్నారు.
సీనియర్‌ సభ్యులు ఎ.బాలిరెడ్డి మాట్లాడుతూ తాను ఈనాడులో జర్నలిస్టుగా మద్రాసుకు వెళ్లినప్పుడు అక్కడ నాకు ఎవ్వరు పరిచయం లేరు. ఆ రోజు ఉమా మహేశ్వరరావు నన్ను ఇంటికి తీసుకుని వెళ్లి భోజనం పెట్టి..
మద్రాసులో ఉండటానికి ఏర్పాట్లు చేయించారు. అప్పటి నుండి ఉమా మహేశ్వరరావుతో అనుబంధం కొనసాగుతూనే ఉంది. అందరి వాడైన ఉమా మహేశ్వరరావుకు ఈ పదవి ఇవ్వడం సముచితం. ఈ సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నారు.
ఫిలింక్రిటిక్స్ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ సీనియర్‌ జర్నలిస్టు మామిడిపల్లి గిరిధర్‌ మాట్లాడుతూ .. తాను మద్రాసుకు వెళ్ళి నప్పుడు అక్కడ నాకు ఎవ్వరు తెలియదు. అయోమయ స్థితిలో ఉన్నప్పుడు ఆయన నన్ను ఇంటికి తీసుకు వెళ్లి భోజనం పెట్టి .. నాకు ధైర్యం చెప్పి ప్రోత్సహించాడు. అలాంటి మంచి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇలాంటి మంచి పదవి ఇవ్వడం ఆనందంగా ఉంది. ఈ సందర్బంగా వారికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నారు.
ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు ఏ. ప్రభు మాట్లాడుతూ .. సినిమా పరిశ్రమలో అందరివాడిగా.. వివాద రహితుడిగా పేరు ఉన్న ఉమామహేశ్వరరావుకి ఈ పదవి అలంకార ప్రాయమైనది. ఆయన గతంలో సినిమా పరిశ్రమకు సంబంధించిన ఎన్నో కమిటీల్లో పని చేసిన అనుభవం ఉన్నవారు . ఏపీ ఫిలింఛాంబర్‌ కు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ గా ఎన్నికైన సందర్భంగా ఆయనకు నా అభినందనలు తెలుపుకుంటున్నాను అన్నారు.
ఫిలింక్రిటిక్స్ ఉపాధ్యక్షుడు జనార్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ .. మితభాషి అందరికీ కావలసిన వ్యక్తి మరి ముఖ్యంగా ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్‌ సభ్యుడైనా ఉమా మహేశ్వరరావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సముచితమైన స్థానం
కల్పించింది. ఈ సందర్బంగా ఉమా మహేశ్వరరావుకు హృదయ పూర్వక శుభాభివందనాలు తెలుపుతున్నాను
అన్నారు.

ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సురేష్‌ కొండేటి మాట్లాడుతూ .. సినిమా పరిశ్రమలో ఎంతో కాలంగా ఉంటూ సినిమా పరిశ్రమకు సేవలందించిన ఉమా మహేశ్వరరావు వివాద రహితుడు .. ఆయన ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్‌ లో నంది అవార్డుల కమెటీలో చాలా సార్లు ఉన్నారు. అలాగే అస్కార్ కమెటీలో కూడా ఉన్నారు.
తొలి సారి ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం ఛాంబర్‌ కు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ గా ఎన్నిక చేసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్‌
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు .. ఆంధ్రప్రదేశ్‌ ఎఫ్.డి.సి ఛైర్మన్‌ భరత్‌ భూషన్‌కి, హీరో బాలకృష్ణకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఉమామహేశ్వరరావుకు శుభాకాంక్షలు అన్నారు.
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్‌ అధ్యక్షుడు బత్తుల ప్రసాద్‌ మాట్లాడుతూ మా ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్‌ సీనియర్‌ సభ్యుడు ఉమా మహేశ్వరరావుకు ఈ పదవి ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. మా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్‌
కు దక్కిన గౌరవంగా భావిస్తున్నాము. ఉమా మహేశ్వరరావు తనకు ఇచ్చిన ఈ బాధ్యతను ప్రేమతో నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకుంటారనే నమ్మకం మాకుంది. ఈ సందర్భంగా ఈ పదవిని ఉమా మహేశ్వరరావుకు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సంబంధిత మంత్రి వర్గానికి, హీరో బాలకృష్ణకి ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్‌ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము అన్నారు.
ఏపీ ఎఫ్.డి.సి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌ కొండపనేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ .. నా కుటుంబ సభ్యలైన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సహచర సభ్యులు నాకు ఆత్మీయ సత్కారం చేయడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఈ పదవి నాకు రావడానికి కారకులైన నారాచంద్రబాబు నాయుడుకి, బాలకృష్ణకి, భరత్‌ భూషన్‌ కి ప్రసన్న కుమార్‌కి నా
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు.
ఈ కార్యక్రమంలో ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు జనార్దన్ రెడ్డి, ఎం.డి అబ్దుల్, కోశాధికారి చదలవాడ భరద్వాజ, కార్యవర్గ సభ్యులు అప్పాజీ, చందు రమేష్‌, ఆర్‌.డి.యస్‌ ప్రకాష్‌, గోరంట్ల రవి తదితరులు పాల్గొన్నారు.

Related posts