మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ, సినిమా విడుదల మాత్రం ఆలస్యమవుతూనే ఉంది. ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయాలని మేకర్స్ భావించినా, తాజా పరిస్థితుల ప్రకారం అది కష్టంగానే కనిపిస్తోంది. చిత్రానికి సంబంధించిన కీలకమైన విఎఫ్ఎక్స్ పనులు ఇంకా పెండింగ్‌లో ఉండటమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం హరి గౌర బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు, ఈ సినిమా ఓటీటీ డీల్‌ను ముగించడం మేకర్స్‌కు పెద్ద సవాలుగా మారింది. విఎఫ్ఎక్స్ షాట్స్ పూర్తికాగానే ఫైనల్ ఎడిటింగ్‌ను లాక్ చేసి, టాప్ డిజిటల్ సంస్థలకు ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ డిజిటల్ బిజినెస్ క్లోజ్ అయిన తర్వాతే అధికారిక విడుదల తేదీపై స్పష్టత రానుంది. ప్రస్తుతానికైతే ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ ప్లాన్‌పై క్లారిటీ లేదు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలు…
Day: May 29, 2026
కార్యదీక్షా పరుడు..వివాద రహితుడు కొండపనేని ఉమామహేశ్వరరావు
* ఏపీ ఎఫ్.డి.సి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కొండపనేని ఉమామహేశ్వరరావుకు ఫిలింక్రిటిక్స్ సత్కారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం టెలివిజన్ & థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధ్యక్షుడిని కార్యవర్గాన్ని నియమించిన విషయం విదితమే. కాగా అందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా సీనియర్ పాత్రికేయులు, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యుడైన కొండపనేని ఉమామహేశ్వరరావుని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ పాలక వర్గం ఆయనను ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ నందు శుక్రవారం నాడు ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు జి.ఆదిశేషగిరిరావు, కాజా సూర్యనారాయణ ఆత్మీయ అతిధులుగా పాల్గొన్నారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి పుష్ఫగుచ్చాన్ని ఇవ్వగా .. సీనియర్ సభ్యలు ఎ.బాలిరెడ్డి, కె. వెంకటేశ్వరరావులు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ ఫిల్మ్…
