బన్నీ-అట్లీ సినిమాపై పెరుగుతున్న అంచనాలు!

Expectations are rising on the Bunny-Atlee movie!
Expectations are rising on the Bunny-Atlee movie!
Spread the love

పాన్‌ ఇండియా లెవెల్‌ లో తెలుగు హీరోలు తీస్తున్న సినిమాలు చిత్రసీమను షేక్‌ చేస్తున్నాయి. హాలీవుడ్‌ లెవెల్‌ యాక్షన్‌ హంగులు ఉన్న భారీ సెట్టింగ్స్‌, ఇలా ఎన్నెన్నో సినిమాలు ఇండియన్‌ సినిమా దగ్గర నుంచి వస్తున్నాయి. ఇక అలా ఇండియన్‌ సినిమా నుంచి రీసెంట్‌గా ఇంటర్నేషనల్‌ లెవెల్లో అనౌన్స్‌ అయిన సినిమా ఏదైనా ఉంది అంటే.. అది ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ అని చెప్పవచ్చు. కాగా ఈ చిత్రం అనౌన్స్‌ చేసినపుడే అందులో విజువల్స్‌ చూసి హాలీవుడ్‌ లెవల్లో ప్లాన్‌ చేస్తున్నట్టు అర్ధం అవుతుంది. అయితే ఈ మూవీలో బన్ని మొత్తం మూడు పాత్రలు పోషించననున్నారని తెలుస్తోంది. ఇందుకోసం చాలా కసరత్తులు చేస్తున్నాడట. ఇక ఈ సినిమాతో విజువల్‌ ఎఫెక్ట్స్‌ పరంగా ఆడియెన్స్‌ని ఖచ్చితంగా మరో లోకం లోకి తీసుకెళ్ళడానికి బన్నీ ఇంకా అట్లీ ఇద్దరు గట్టిగా ప్లాన్‌ చేస్తున్నారట. ఇదిలా ఉంటే ఈ రెంజ్‌ మూవీ కోసం యాక్టర్స్‌ని ఎంచుకోవడం ఒక్కింత కష్టం అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పాత్ర చాలా ముఖ్యం. అందుకే ఇప్పటిక వరకు ఈ మూవీలో నటనటుల గురించి ఎలాంటి అప్‌ డేట్‌లు రావడంలేదు. కానీ తాజాగా ఈ సినిమాలో ఓ స్పెషల్‌ రోల్‌ను డిజైన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రలో ఓ బాలీవుడ్‌ హీరోని తీసుకునే ఆలోచనలో మూవీ టీమ్ ఉన్నట్లు సమాచారం. మరి ఆ హీరో ఎవరు అనేది చూడాలి. ప్రజంట్‌ టాలీవుడ్‌ బారీ చిత్రాల్లో ఒక్కరైనా బాలీవుడ్‌ యాక్టర్స్‌ కచ్చితంగా ఉంటున్నారు. మరి ఈ మూవీలో ఎవరు రాబోతున్నారు చూడాలి మరి!?