ఏపీ ఎస్.ఎఫ్.టీవీ టీడీసీ చైర్మన్ భరత్ భూషణ్ కు ఫిలిం క్రిటిక్స్ సత్కారం

AP SFTV TDC Chairman Bharat Bhushan felicitated by film critics

ఇటీవలే నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం టెలివిజన్ & థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్ ని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు ఫిలిం ఛాంబర్ లో కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగాఏపీ ఎస్.ఎఫ్.టీవీ టీడీసీ చైర్మన్ భరత్ భూషణ్ ని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కార్యవర్గం బొకేతో, శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ భరత్ భూషణ్ మాట్లాడుతూ “ఏపీలో సినీ రంగ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా తన వంతు కృషి చేస్తానని, త్వరలోనే ఏపీలో నంది అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహి స్తాము’ అని తెలిపారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్తిగా సానుకూలంగా ఉన్నారని భరత్ భూషణ్ తెలిపారు. చైర్మన్ భరత్…