శ్రీకాంత్, లయ హీరో హీరోయిన్స్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్. జీకే & సిఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ ని ఈ రోజు లాంచ్ చేశారు. ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి ఈ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. డైరెక్టర్ కృష్ణారెడ్డి రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి గారికి థాంక్స్. చాలా రోజుల తర్వాత హీరోగా నా సినిమా టీజర్ లాంచ్‌కు రావడం ఆనందంగా వుంది. కమలాకర్ గారు ఫోన్ చేసి ఒక మంచి ఎంటర్‌టైనర్ చేద్దామని చెప్పారు. నేను వెంటనే ఖచ్చితంగా చేద్దామని చెప్పాను. నాగేశ్వర్ రెడ్డి గారు దర్శకుడు…
