పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు హీరోలు తీస్తున్న సినిమాలు చిత్రసీమను షేక్ చేస్తున్నాయి. హాలీవుడ్ లెవెల్ యాక్షన్ హంగులు ఉన్న భారీ సెట్టింగ్స్, ఇలా ఎన్నెన్నో సినిమాలు ఇండియన్ సినిమా దగ్గర నుంచి వస్తున్నాయి. ఇక అలా ఇండియన్ సినిమా నుంచి రీసెంట్‌గా ఇంటర్నేషనల్ లెవెల్లో అనౌన్స్ అయిన సినిమా ఏదైనా ఉంది అంటే.. అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ అని చెప్పవచ్చు. కాగా ఈ చిత్రం అనౌన్స్ చేసినపుడే అందులో విజువల్స్ చూసి హాలీవుడ్ లెవల్లో ప్లాన్ చేస్తున్నట్టు అర్ధం అవుతుంది. అయితే ఈ మూవీలో బన్ని మొత్తం మూడు పాత్రలు పోషించననున్నారని తెలుస్తోంది. ఇందుకోసం చాలా కసరత్తులు చేస్తున్నాడట. ఇక ఈ సినిమాతో విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఆడియెన్స్‌ని ఖచ్చితంగా మరో లోకం లోకి తీసుకెళ్ళడానికి…
Year: 2025
అనసూయకు ఫ్యామిలీ సపోర్ట్!
అనసూయ భరద్వాజ్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై జబర్దస్త్ షో ద్యారా యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తన అందం, అభినయంతో చెరగని ముద్ర వేసుకుని, తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ ఇమేజ్ కాస్త తనకు వరుస సినిమా అవకాశాలు కూడా తెచ్చి పెట్టింది. ఇప్పటి వరకు ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘పుష్ప’, ‘ఖిలాడీ’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చివరిగా పుష్ప 2, రాజాకార్ వంటి చిత్రాల్లో నటించింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు : పార్ట్ 1’ చిత్రంతో అలరించబోతోంది. అలాగే వీటితో పాటుగా ‘ఫ్లాష్ బ్యాక్’, ‘వోల్ఫ్’ అనే చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే వ్యక్తి గతంగా అనసూయ చాలా స్ట్రాంగ్ అని చెప్పాలి. ఆమె…
క్యాథరిన్ థెస్రాకు బంపర్ ఆఫర్!
టాలీవుడ్‌లో అందం అభినయంతో ఆకట్టుకొనే గ్లామర్ హీరోయిన్ లో క్యాథరిన్ త్రెసా ఒకరు.’చమ్మక్ చలో’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి నానితో ‘పైసా’, అల్లు అర్జున్‌తో ‘ఇద్దరు అమ్మాయిలతో’, ‘రుద్రమదేవి’, ‘సరైనోడు’ వంటి చిత్రాల్లో నటించింది. వరుస విజయాలతో దూసుకెళ్లిన క్యాథరిన్ తెరపై కనిపించి చాలాకాలం అవుతుంది. అవకాశాలు తగ్గడంతో సైలెంట్ అయిపోయింది. సోషల్ విూడియాలో కూడా కనిపించడం లేదు. ఇక తాజాగా ఈ అమ్మడు బంపర్ ఆఫర్ కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో మంచి ఫ్యామిలీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. పూజా కార్యక్రమాలు, ఓపెనింగ్ అయిపోయింది కాబట్టి నేరుగా సెట్స్ లోకి వెళ్ళిపోతారు. ఇక ముందు నుంచి వైరల్ అవుతున్నట్లుగా మెయిన్ హీరోయిన్‌గా నయనతార ఒకే అయిన విషయం తెలిసిందే. ఇక…
ఇట్స్ న్యూ బిగినింగ్..సమంత ఆసక్తికర పోస్ట్!
‘ఏమాయ చేసావే’తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ సినిమా సూపర్ హిట్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ దశలోనే అక్కినేని వారి వారసుడు నాగచైతన్య తో ప్రేమాయణం, పెళ్లి.. విడాకులు ఇలా అన్ని చకచకా జరిగిపోయాయి. చైతు నుండి విడాకులు తీసుకున్నాక టాలీవుడ్‌కు దూరంగా ఉంటూ వస్తోంది సమంత. అదే టైమ్ లో బాలీవుడ్ లో ఫ్యామిలీ మెన్ సిరీస్ తో సూపర్ హిట్ అందుకుంది. ఈ సిరిస్ తో ప్రశంసలతో పాటు ఆ సిరీస్ దర్శకులలో ఒకరైన రాజ్ నిడమోరుతో ప్రేమలో పడిందనే ఆరోపణలు ఎదుర్కొంది సమంతా. రాజ్.. సమంతలు రిలేషన్ లో ఉన్నారనే టాక్ నడిచింది. ఓ వైపు సామ్ మొదటి భర్త నాగ చైతన్య మరో పెళ్లి చేసుకోవడంతో సమంత కూడా…
జూన్ 12న థియేటర్స్‌లో ‘హరిహరవీరమల్లు’ సందడి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి బిగ్ అప్‌డేట్ వచ్చింది. ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ ఫైనల్‌గా కంప్లీట్ అయిపోయింది. ఎన్నో అవాంతరాల తర్వాత ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ వచ్చేసింది. మొదట మే 9 అని అధికారికంగా అనౌన్స్ చేసినా, షూటింగ్ జస్ట్ కొద్ది రోజుల క్రితమే ముగిసింది కాబట్టి, అంత తొందరగా రిలీజ్ చేయడం కాస్త కష్టమే. ఇప్పుడు తాజా బజ్ ఏంటంటే, ఈ సినిమా జూన్ 12న థియేటర్స్‌లో సందడి చేయబోతోంది! ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ లీడింగ్ టికెట్ సెల్లింగ్ ఫ్లాట్ ఫాం బుక్ మై షో జూన్ 12 డేట్‌తో ‘కమింగ్ సూన్‘ అంటూ ఫైర్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేసింది. సోషల్ విూడియాలో ఫ్యాన్స్ ఇప్పటికే హైప్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి దాదాపు…
నా ‘మహాభారతం’లో నేనే కృష్ణుడిని: ఆవిూర్ ఖాన్
‘మహాభారతం’ కల నెరవేర్చే క్రమంలో బాలీవుడ్ నటుడు అవిూర్ ఖాన్ ఒక్కో విషయం వెల్లడిస్తున్నాడు. అతిపెద్ద పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిన ‘మహాభారతం’పై ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్ తన డ్రీమ్ అని ఆవిూర్ ఖాన్ ఇప్పటికే చాలా సార్లు ప్రకటించారు. ఇక తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి మరోసారి స్పందించారు ఆవిూర్ ఖాన్. ‘ఈ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందులో నాకు కృష్ణుడి పాత్ర చేయాలని ఉంది. ఆ పాత్ర నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఒక పాత్రలో ఇన్ని రకాల వేరియేషన్స్ ఉంటాయా అనిపించేలా ఉంటుంది కృష్ణుడి పాత్ర. ఆ పాత్రలో నటించడం చాలా కష్టం. అందులో ఉండే అన్ని షేడ్స్ విభిన్నంగా ఉంటాయి. అందుకే ఆ పాత్ర చేయాలని ఉందని తెలిపారు. ఈ ‘మహాభారతం’ను ఒక…
తెలుగు వెబ్ సీరిస్‌లోకి కోవై సరళ!
లేడీ కమెడియన్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు కోవై సరళ. అప్పట్లో ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమోగింది. ముఖ్యంగా బ్రహ్మానందం, కోవై సరళ జోడికి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉండేవారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి, తనదైన బాషతో డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ తో దాదాపు రెండు దశాబ్దాల పాటు కోవై సరళ అందరినీ మెప్పించింది. అయితే కారణాలు ఏవైనా ఆమె కొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరమైంది. తెలుగు అని కాదు తమిళంలో కూడా అడపాదడపా సినిమాలు చేస్తోంది. అలా తెలుగులో డబ్ అయి వచ్చిన సినిమాలను మాత్రమే తెలుగు వాళ్ళు చూసి ఆనందించాల్సి వస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు కోవై సరళ ఓ తెలుగు వెబ్ సీరిస్ లో ఎంట్రీ ఇస్తోందట. యంగ్ హీరోయిన్ రీతూ వర్మ,…
తెరకెక్కనున్న మరాఠి రాణి అహల్యా బాయి బయోపిక్!
ఇప్పటికే ఎంతోమంది ధీరుల బయోపిక్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్న క్రమంలో తాజాగా మరాఠి రాణి అహల్యా బాయి హోల్కర్ జీవితం తెరకెక్కనుంది. ఆమె జీవితగాధ ఆధారంగా సినిమా తీయనున్నట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. రాణి అహల్యా బాయి హోల్కర్ 300వ జయంతిని పురస్కరించుకొని మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రమంతటా కొన్ని ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టింది. అలానే ఆమె జీవితం ఎంతోమందికి స్ఫూర్తి అని అందుకే సినిమాగా ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించుకున్నట్లు సీఎం తెలిపారు. దీనిపై ఇప్పటికే చర్చలు ప్రారంభమైనట్లు వెల్లడించారు. మరాఠీతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమా విడుదల చేయనున్నట్లు చెప్పారు. దూరదర్శన్, ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోనూ రాణి అహల్యా బాయి హోల్కర్ బయోపిక్ అందుబాటులో ఉండేలా చూస్తామని అన్నారు. ఇటీవలే మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ వీరగాథ ‘ఛావా’ ప్రేక్షకుల ముందుకువచ్చి భారీ విజయాన్ని…
ఆమీర్ ఖాన్ ‘మహా భారతం’లో బన్నీ!?
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఆమిర్ ఖాన్‌ను ఇటీవల అల్లు అర్జున్ కలిశారు. ముంబయిలోని ఆయన నివాసానికి వెళ్లిన బన్నీ ఆమిర్ తో కలిసి కొంత సమయం ముచ్చటించారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతుండగా.. అభిమానులు వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందేమోనని ఆశిస్తున్నారు. ఇటీవల ఆమిర్‌ఖాన్ మాట్లాడుతూ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహా భారతం’ గురించి తెలిపారు. అందులో అగ్ర కథానాయకులు భాగం కానున్నట్లు చెప్పారు. దీంతో బన్నీ ఈ ప్రాజెక్ట్‌లో నటించనున్నారా అనే సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుతం అట్లీ సినిమాతో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. ఇందులో ఆయన ద్విపాత్రాభినయంలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించనున్నారు. దీనికోసం అట్లీ, అల్లు అర్జున్ లాస్ ఏంజెలెస్‌లోని ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ సంస్థను ఇటీవల సంప్రదించారు. ఇందులో…
మరోసారి రష్మిక, విజయ్ జోడీ!
ఆన్‌స్క్రీన్ పై కొన్ని జోడీలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి ఓ జోడీనే విజయ్ దేవరకొండ- రష్మికలదని చెప్పవచ్చు. వీరిద్దరూ కలిసి వెండితెరపై రెండుసార్లు సందడి చేశారు. వీరిద్దరూ కలిసి ‘గీత గోవిందం’లో నటించి మంచి ఆన్‌స్క్రీన్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. దీని తర్వాత ‘డియర్ కామ్రేడ్’తో అలరించారు. ఈ చిత్రం కమర్షియల్‌గా హిట్ కాకపోయినప్పటికీ యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేసినా ఈ చిత్రం వారికెంతో ప్రత్యేకమని గతంలో విజయ్, రష్మిక ఇద్దరూ వెల్లడించారు. ఇప్పుడు ఈ జోడీ మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మైత్రీ మూవీస్ పెట్టిన ఓ పోస్ట్‌కు రష్మిక రిప్లయి ఇవ్వడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘కింగ్‌డమ్’తో బిజీగా ఉన్నారు.…
