ఇట్స్‌ న్యూ బిగినింగ్‌..సమంత ఆసక్తికర పోస్ట్‌!

It's a new beginning.. Interesting post Samantha!
Spread the love

‘ఏమాయ చేసావే’తో టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ సినిమా సూపర్‌ హిట్‌ తో బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌ గా మారింది. ఆ దశలోనే అక్కినేని వారి వారసుడు నాగచైతన్య తో ప్రేమాయణం, పెళ్లి.. విడాకులు ఇలా అన్ని చకచకా జరిగిపోయాయి. చైతు నుండి విడాకులు తీసుకున్నాక టాలీవుడ్‌కు దూరంగా ఉంటూ వస్తోంది సమంత. అదే టైమ్‌ లో బాలీవుడ్‌ లో ఫ్యామిలీ మెన్‌ సిరీస్‌ తో సూపర్‌ హిట్‌ అందుకుంది. ఈ సిరిస్‌ తో ప్రశంసలతో పాటు ఆ సిరీస్‌ దర్శకులలో ఒకరైన రాజ్‌ నిడమోరుతో ప్రేమలో పడిందనే ఆరోపణలు ఎదుర్కొంది సమంతా. రాజ్‌.. సమంతలు రిలేషన్‌ లో ఉన్నారనే టాక్‌ నడిచింది. ఓ వైపు సామ్‌ మొదటి భర్త నాగ చైతన్య మరో పెళ్లి చేసుకోవడంతో సమంత కూడా పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు హల్‌ చల్‌ చేసాయి. కానీ అవన్నీ గాసిప్‌ లాగే మిగిలాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్‌ గా సమంత ‘ఇది చాలా కష్టమైన ప్రయాణం. కానీ ఇక్కడి వరకూ చేరుకున్నాం. ఇట్స్‌ న్యూ బిగినింగ్‌ ‘ అని పోస్ట్‌ చేస్తూ దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో దిగిన ఫోటోలను సోషల్‌ విూడియాలో షేర్‌ చేసింది. ఈ ఫోటోలు సోషల్‌ విూడియాలో వైరల్‌ గా మారాయి. ఇక సమంత నిర్మించిన ‘శుభం’ మే 9న విడుదలైన విషయం తెలిసిందే. ‘సినిమా బండి’ ఫేమ్‌ ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వం వహించాడు. ఈయన డైరెక్ట్‌ చేసిన తొలిసినిమా ’సినిమా బండి’ కి రాజ్‌ నిడిమోరు నిర్మాతగా వ్యహరించగా రెండవ సినిమాను సమంత నిర్మించడం కొసమెరుపు. ఇంతకీ సమంత చెప్పిన ఆ న్యూ బిగినింగ్‌ లోగుట్టు ఏమిటో వేచి చూడాల్సిందే…

Related posts

Leave a Comment