నా ‘మహాభారతం’లో నేనే కృష్ణుడిని: ఆవిూర్‌ ఖాన్‌

I am Krishna in my 'Mahabharata': Avir Khan
Spread the love

‘మహాభారతం’ కల నెరవేర్చే క్రమంలో బాలీవుడ్‌ నటుడు అవిూర్‌ ఖాన్‌ ఒక్కో విషయం వెల్లడిస్తున్నాడు. అతిపెద్ద పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ అయిన ‘మహాభారతం’పై ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌ తన డ్రీమ్‌ అని ఆవిూర్‌ ఖాన్‌ ఇప్పటికే చాలా సార్లు ప్రకటించారు. ఇక తాజాగా ఈ ప్రాజెక్ట్‌ గురించి మరోసారి స్పందించారు ఆవిూర్‌ ఖాన్‌. ‘ఈ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందులో నాకు కృష్ణుడి పాత్ర చేయాలని ఉంది. ఆ పాత్ర నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఒక పాత్రలో ఇన్ని రకాల వేరియేషన్స్‌ ఉంటాయా అనిపించేలా ఉంటుంది కృష్ణుడి పాత్ర. ఆ పాత్రలో నటించడం చాలా కష్టం. అందులో ఉండే అన్ని షేడ్స్‌ విభిన్నంగా ఉంటాయి. అందుకే ఆ పాత్ర చేయాలని ఉందని తెలిపారు. ఈ ‘మహాభారతం’ను ఒక మూవీలో చూపించలేం. దాన్ని కొన్ని భాగాలుగా చూపించొచ్చు. ఆ మూవీ స్క్రిప్ట్ కోసమే కొన్నేళ్ల టైమ్‌ పడుతుంది. త్వరలోనే అది నెరవేరుతుందని ఆశిస్తున్నాను. ప్రస్తుతం సినిమాల పరంగా కొంత స్పీడ్‌ తగ్గింది. కానీ నా సినిమాల కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని తీసుకుంటున్నాను. నా సినిమాల్లో నేను లాభాల్లో షేర్‌ తీసుకుంటాను. హిట్‌ అయితే మాత్రమే ఈ షేర్‌ తీసుకుంటా. ఒకవేళ ప్లాప్‌ అయితే ఒక్క రూపాయి కూడా తీసుకోను. ఎందుకంటే సినిమా నష్టాల్లో కూడా నేను బాధ్యత తీసుకోవాలి అనుకుంటాను’’ అంటూ చెప్పుకొచ్చాడు ఆవిూర్‌ ఖాన్‌. మొత్తంగా ‘మహాభారతం’ ఎలా తీస్తారన్న ఆసక్తి నెలకొంది.

Related posts

Leave a Comment