మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి ఈ రోజు (మార్చి 3) తమ మూడవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల మధ్య ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. సినిమా, ఫ్యామిలీ మధ్య ఉన్న రిలేషన్ కారణంగా ఈ ఇద్దరూ ఒక్కటయ్యారని అంతా అనుకుంటారు. కానీ ఇద్దరిలో ఉన్న క్రమశిక్షణ, జీవిత లక్ష్యాల కారణంగా ఒక్కటయ్యారు. అలా పరిచయం ప్రేమగా మారి ఇద్దర్నీ జీవిత ప్రయాణంలో ఒకే దారికి తీసుకు వచ్చింది. మూడు సంవత్సరాల వైవాహిక బంధం తర్వాత మనోజ్ – భూమ కుటుంబం మరింత అందంగా పెరిగింది. కుమారుడు ధైరవ్‌తో పాటు ఏప్రిల్ 2, 2024న జన్మించిన దేవసేన శోభ ఎంఎంతో మనోజ్, మౌనికల జీవితం మరింత అందంగా, ఆదర్శవంతంగా మారింది. వృత్తిపరంగా మనోజ్‌కి వివాహాం తరువాత మరింత కలిసి వచ్చింది. ‘భైరవం’,…
Day: March 3, 2026
‘కాక్రోచ్’లో మన సొసైటీలోని డార్క్ సైడ్ చూపిస్తున్నాం : దర్శక నిర్మాతలు పి. సునీల్ కుమార్ రెడ్డి, బి. బాపిరాజు
సొంత ఊరు, గంగపుత్రులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గల్ఫ్, వలస వంటి చిత్రాలతో అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు అందుకున్న డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి రూపొందిస్తున్న తాజా చిత్రం “కాక్రోచ్”. ఈ చిత్రంలో అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. “కాక్రోచ్” సినిమాను శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మిస్తున్నారు.ఈ సినిమా మార్చి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాత బి.బాపిరాజు. నిర్మాత బి.బాపిరాజు మాట్లాడుతూ.. – నేను 70వ దశకంలో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ట్ చేశాను. తమిళ సినిమాలను కొని తెలుగులో రిలీజ్ చేసేవాళ్లం. అప్పుడు డబ్బింగ్ ద్వారానే ఇతర చిత్రాలను…
స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది : హీరోయిన్ లయ ఇంటర్వ్యూ..
* ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్‌తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్న సినిమా ఇది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా వస్తున్న ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాను ఈటీవీ విన్ అసోసియేషన్‌తో శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రిక్కి సమర్పణలో హీరో శివాజీ స్వయంగా నిర్మిస్తుండగా.. సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. ఈ నెల 6న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ లయ…
