మరోసారి రష్మిక, విజయ్‌ జోడీ!

Rashmika and Vijay are together once again!
Spread the love

ఆన్‌స్క్రీన్ పై కొన్ని జోడీలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్‌ ఉంటారు. అలాంటి ఓ జోడీనే విజయ్‌ దేవరకొండ- రష్మికలదని చెప్పవచ్చు. వీరిద్దరూ కలిసి వెండితెరపై రెండుసార్లు సందడి చేశారు. వీరిద్దరూ కలిసి ‘గీత గోవిందం’లో నటించి మంచి ఆన్‌స్క్రీన్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. దీని తర్వాత ‘డియర్‌ కామ్రేడ్‌’తో అలరించారు. ఈ చిత్రం కమర్షియల్‌గా హిట్‌ కాకపోయినప్పటికీ యూత్‌కు బాగా కనెక్ట్‌ అయింది. కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేసినా ఈ చిత్రం వారికెంతో ప్రత్యేకమని గతంలో విజయ్‌, రష్మిక ఇద్దరూ వెల్లడించారు. ఇప్పుడు ఈ జోడీ మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మైత్రీ మూవీస్‌ పెట్టిన ఓ పోస్ట్‌కు రష్మిక రిప్లయి ఇవ్వడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం ‘కింగ్‌డమ్‌’తో బిజీగా ఉన్నారు. దీనితో పాటు ఆయన మరో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో రూపొందనున్న ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ వచ్చే నెల నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభించుకోనుందని సమాచారం. ఇప్పుడీ చిత్రంలో విజయ్‌ సరసన రష్మిక నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై నిర్మాణసంస్థ ఓ పోస్ట్‌ పెట్టింది. వేచి చూద్దాం అని అర్థం వచ్చేలా ఉంది. దీనికి రష్మిక ఓకే..’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్‌ చేశారు. దీంతో వీరిద్దరి జోడీ ఖరారైందని అభిమానులు భావిస్తున్నారు. ఇదే నిజమైతే ముచ్చటగా మూడోసారి ఈ జోడీని చూడొచ్చని సంబరపడుతున్నారు.

Related posts

Leave a Comment