యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ‘లెనిన్’ ఓ డిఫరెంట్ స్టోరీతో రాబోతోంది. ఇప్పటికే ఫస్ట్ సింగిల్‌తో మంచి బజ్ ఏర్పడింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. భావోద్వేగాలతో పాటుగా ఆకట్టుకునే కథనంతో కంప్లీట్ సినిమాటిక్ ప్యాకేజీగా ‘లెనిన్’ రూపుదిద్దుకుంటోంది. అఖిల్ అక్కినేని పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా నిర్మాతలు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ ఈ పవర్ ఫుల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అఖిల్ కొత్త…
Year: 2026
అతడే..ఆమె లక్కీ ఛార్మ్..
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘డెకాయిట్’. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నడుస్తున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు విక్టరీ వెంకటేష్, సిద్ధు జొన్నలగడ్డ వంటి స్టార్లు హాజరై చిత్ర యూనిట్‌కు ఆశీస్సులు అందించారు. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న నటి మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. రణ్‌వీర్ సింగ్‌ను తన ‘లక్కీ ఛార్మ్’అని అన్నారు. “ఈ రోజు నేను చిత్ర పరిశ్రమలో ఒక నటిగా ఉన్నానంటే దానికి కారణం ఆయనే” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన కెరీర్ ఆరంభంలో రణ్‌వీర్‌తో కలిసి ఒక హెయిర్ బ్రాండ్ వాణిజ్య ప్రకటనలో నటించానని అన్నారు. ఆ యాడ్ చూసిన తర్వాతే సినీ నిర్మాతలు తనను గుర్తించి అవకాశాలు ఇచ్చారని ఆమె వెల్లడించారు. రణ్‌వీర్…
‘ఐకాన్ స్టార్’కు ఆల్ ది బెస్ట్ చెప్పిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ‘రాకా’ ఫస్ట్ లుక్ ను కూడా ఈ సందర్భంగా అప్రిషియేట్ చేశారు. బర్త్ డే బోయ్ ను కలిసినవారిలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ప్రభు, అధ్యక్షులు బత్తుల ప్రసాద్, జనరల్ సెక్రటరీ సురేష్ కొండేటి, ట్రెజరర్ భరద్వాజ, వైస్ ప్రెసిడెంట్ జనార్దన్ లతోపాటు జాయింట్ సెక్రటరీ శ్యామ్ రావుట్ల, కార్యవర్గ సభ్యులు ధీరజ అప్పాజీ, కుమార్ తదితరులు ఉన్నారు. మీ అందర్నీ త్వరలోనే సావకాశంగా కలుస్తానని ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేర్కొన్నారు!!
‘డెకాయిట్’ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. అందులో డౌట్ లేదు: ప్రీరిలీజ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్
బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ,పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డెకాయిట్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. డెకాయిట్ ఈవెంట్ కు అందరూ…
దర్శకుడు జయశంకర్: ట్రెండ్ సెట్టర్ ఐడియాలకే ఇప్పుడు ‘క’ (KA), ‘LIK’ కేరాఫ్ అడ్రస్!
టాలీవుడ్ లో ప్రస్తుతం వస్తున్న కొన్ని భారీ విజయాలను చూస్తుంటే, దర్శకుడు జయశంకర్ ఆలోచనలు ఎంతటి ముందుచూపుతో కూడుకున్నవో అర్థమవుతోంది. ఆయన ఎప్పుడో చేసిన ప్రాజెక్ట్‌లకు ఇప్పుడు వస్తున్న సినిమాలు ఎక్స్‌టెండెడ్ వెర్షన్లుగా అనిపిస్తుండటం విశేషం. ‘క’ (KA) vs ‘ది గాడ్ మస్ట్ బి క్రేజీ’ ఇటీవల కిరణ్ అబ్బవరం కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సినిమా ‘క’ (KA). ఈ చిత్రం చూసిన వారికి జయశంకర్ 2015లో రూపొందించిన ‘ది గాడ్ మస్ట్ బి క్రేజీ’ (The God Must Be Crazy) ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. దేవుడికి, మనిషికి మధ్య ఉండే ఆ బలమైన కాన్సెప్ట్, స్క్రీన్‌ప్లే పరంగా ఉన్న పోలికలు చూస్తుంటే.. జయశంకర్ ఆనాడే ఎంతటి అడ్వాన్స్‌డ్ కథను రాసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ‘LIK’ vs ‘విటమిన్ షీ’ అలాగే, కోలీవుడ్ సెన్సేషన్…
ఆ డైరెక్టర్ ఐడియాలే ఇప్పుడు సూపర్ హిట్స్!
ఆ డైరెక్టర్ ఎప్పుడో చేసిన ప్రాజెక్టులకు ఇప్పుడు ఎక్స్ టెండెడ్ వెర్షన్స్ అనిపిస్తున్నాయి కొన్ని సినిమాలు. ఆయన ఎవరో కాదు దర్శకుడు జయశంకర్. టాలీవుడ్ లో ప్రస్తుతం వస్తున్న పలు విజయవంతమైన చిత్రాల కాన్సెప్ట్స్ ను చూస్తే అదే అనిపిస్తోంది. ఇటీవల కిరణ్ అబ్బవరానికి భారీ హిట్ ఇచ్చిన ‘క’ (KA) సినిమా చూసిన వారికి, జయశంకర్ రూపొందించిన ‘ది గాడ్ మస్ట్ బి క్రేజీ’ (The God Must Be Crazy)( 2015) ప్రాజెక్ట్ ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. ఆ షార్ట్ ఫిల్మ్, ఈ మూవీ చూస్తే కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే దాదాపు సేమ్ టు సేమ్ అనిపిస్తాయి. ‘ది గాడ్ మస్ట్ బి క్రేజీ’లో దేవుడికి, మనిషికి మధ్య ఉన్న ఒక అత్యంత బలమైన కాన్సెప్ట్ ను జయశంకర్ ఎప్పుడో అద్భుతంగా ఆవిష్కరించారు. అలాగే, కోలీవుడ్…
ఘనంగా శ్రీజ స్వీయ దర్శకత్వంలో నిర్మించి హీరోయిన్ గా నటించిన ‘కొత్త కొత్తగా’ సాంగ్ ఆల్బమ్ లాంఛ్
యంగ్ హీరోయిన్ శ్రీజ నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సాంగ్ ఆల్బమ్ “కొత్త కొత్తగా”. ఈ సాంగ్ లో “దేవగుడి” మూవీ ఫేమ్ హీరో అభినవ్ శౌర్య హీరోగా నటించారు. ఈ పాటకు లిరిక్స్, సంగీతాన్ని అందించారు రఘురామ్. సింగర్ లిప్సిక పాడారు. కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో… నిర్మాత డీవై చౌదరి మాట్లాడుతూ – శ్రీజ చాలా ప్రతిభావంతురాలు. మేము నిర్మించిన సీరియల్స్ లో నటించింది. ఇంకా ఏదో సాధించాలనే తపన ఆమెలో కనిపించేది. ఇప్పుడు కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్ లో తనే నటించి నిర్మించి, దర్శకత్వం వహించింది. ఈ సాంగ్ చాలా బాగుంది. ఒక మూవీ సాంగ్ లా రిచ్ గా రూపొందించింది శ్రీజ. ఆమెతో పాటు…
మెగాస్టార్ `విశ్వంభర`పై మౌనమేల!?
మెగాస్టార్ చిరంజీవి మంచి జోష్ మీదున్నారు. ఇటీవల సంక్రాంతికి `మన శంకర వరప్రసాద్‌గారు`తో బ్లాక్ బస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్న చిరు అదే జోష్‌తో మరో సినిమాని రంగంలోకి దించేస్తాడని.. అదే ఊపుతో మరో చిత్రానికి శ్రీకారం చుట్టేస్తాడని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ అది అంత ఈజీ కాదని జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. ‘మన శంకర వరప్రసాద్‌గారు’కు ముందు చిరు మొదలు పెట్టిన భారీ గ్రాఫికల్ యాక్షన్ అడ్వెంచర్ ‘విశ్వంభర’. మల్లిడి వశిష్ట దర్శకుడు. సినిమా పూర్తయింది. యువీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ విడుదలై దాదాపు ఏడాది పూర్తయింది. అయినా సరే ఇప్పటికీ దీని రిలీజ్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. టీమ్ నుంచి ప్రకటనా లేదు. గ్రాఫిక్స్ ఆశించిన స్థాయి క్వాలిటీగా లేవని గ్లింప్స్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో సినిమా…
‘వేగలీలా’ ఫస్ట్ లుక్ పోస్టర్
టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ‘వేగలీలా’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. పోస్టర్‌లో కనిపిస్తున్న డిజైన్, కలర్ టోన్.. టైటిల్ స్టైలింగ్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఘంటసాల నాగ విశ్వనాథ్ రచించి, దర్శకత్వం వహిస్తున్నారు. స్ప్లాష్ కలర్ మీడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై, శ్రీ లక్ష్మి మణికర్ణిక ప్రొడక్షన్స్ ,జశ్రీత ప్రొడక్షన్స్ .. రితికా ఫిలిమ్స్ సంస్థలతో కలిసి ఈ చిత్రం రూపొందుతోంది. నిర్మాతలుగా సాయి కుమార్ మెడి – జయ వేణు బాబు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు లో విడుదలకు సన్నాహాలకు ప్లాన్ చేస్తున్నారు . ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి – పవన్ చరణ్ సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే పవన్ చరణ్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా మొదటి సినిమా కావడం విశేషం.…
మైమరపించిన సత్యభామ సంజయ్ నవ జనార్దన పారిజాతం
నటరాజ రామకృష్ణ నృత్యరత్న తొలి జాతీయ పురస్కారంతో కళాకృష్ణకు ఘన సత్కారం హైదరాబాద్ : సత్యభామ వేషం ధరించి అతను అరుదైన దరువులు ప్రదర్శిస్తుంటే కళాప్రియుల హృదయాలు తన్మయత్వం చెందాయి. సత్యభామగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన హాంగ్ కాంగ్ కు చెందిన సంజయ్ వడపల్లి ఆంధ్ర నాట్య శైలిలో నవజనార్దన పారిజాతం ప్రదర్శించి కొన్ని కొత్త దరువులతో ఆకట్టుకున్నారు. వడపల్లి కల్చరల్, ది డ్యాన్సింగ్ బెల్స్ నృత్య సంస్థ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వ విద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో సంజయ్ వడపల్లి ఆంధ్రనాట్యం ప్రదర్శన కనుల పండువగా జరిగింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, హరికథ భాగవతారిణి పద్మశ్రీ ఉమా మహేశ్వరి, కళ పత్రిక సంపాదకులు డా. మహ్మద్ రఫీ, అన్నమయ్య పరిశోధకులు డా. గంధం…
