‘రావు బహదూర్’ డ్యాన్సులు నా కెరీర్‌లోనే స్పెషల్ : హీరో సత్యదేవ్

'Rao Bahadur' dances are special in my career: Hero Satya Dev
Spread the love

సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’ చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తున్నారు. వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా కథ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ‘ఓ సుందరి’ పాట, టీజర్  సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. తాజాగా చిత్ర బృందం రెండో పాట ‘దేశ సంచారి’ని విడుదల చేసింది. ‘దేశ సంచారి’ పాట ఆల్బమ్‌కు రెట్రో టచ్, విన్టేజ్ గ్లామర్‌ను తీసుకొచ్చే ప్రత్యేక గీతంగా నిలిచింది. సంగీత దర్శకుడు స్మరణ్ సాయి అందించిన ఈ కంపోజిషన్ ఉత్సాహభరితమైన బీట్‌లు, ఆకట్టుకునే హుక్స్‌తో అదిరిపోతుంది. వింటేజ్ మాధుర్యాన్ని గుర్తు చేస్తూనే, నేటి ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యేలా ఈ పాటను తీర్చిదిద్దారు. రెహమాన్ అందించిన సాహిత్యం, హేమచంద్ర, ప్రియాంక గజానన్ పాడిన తీరు పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారి స్వరాలు పాటలోని విన్టేజ్ ఫీల్‌ను మరింత బలంగా ప్రజెంట్ చేశాయి. ఈ పాటలో ప్రధాన ఆకర్షణ దాని విజువల్ ప్రెజెంటేషన్. భారీ స్థాయిలో రూపొందించిన పబ్ సెటప్‌లో సత్యదేవ్, హైడీ కరోలా శ్రవణ్ ముప్పిరి కొరియోగ్రఫీ చేసిన సాల్సా స్టయిల్ లో డ్యాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రతి ఫ్రేమ్‌ను మరింత ప్రత్యేకంగా మార్చాయి. రెట్రో వైబ్, అద్భుతమైన మ్యూజిక్, స్టైలిష్ విజువల్స్‌తో ‘దేశ సంచారి’ పాట సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘రావు బహదూర్’లో ఒక రిఫ్రెషింగ్ మ్యూజికల్ మూమెంట్‌గా నిలుస్తోంది. థియేటర్లలో ఈ పాట ప్రేక్షకులను మరింత అలరించేలా ఉంది. ఈ చిత్రంలో దీపా థామస్ కథానాయికగా నటిస్తుండగా, వికాస్ ముప్పాల, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాకా, మాస్టర్ కిరణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కథతో పాటు సాంకేతికంగా కూడా ‘రావు బహదూర్’ ప్రత్యేకంగా నిలుస్తోంది. కార్తీక్ పరమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, స్మరణ్ సాయి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. రోహన్ సింగ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రావు బహదూర్’ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియా అడుగిన ప్రశ్నలకు సత్యదేవ్ సమాధానాలు ఇచ్చారు. ఆ విశేషాలివి..
మీ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఈ స్థాయిలో డ్యాన్స్‌లు చేసినట్టుగా ఉంది అని అడిగితే..” అందరికీ డ్యాన్స్ విషయంలో ఈ ఒక పాటే కనిపిస్తుంది. కానీ ఇందులో ఇంకో రెండు పాటలు కూడా ఉన్నాయి. నా కెరీర్ లోనే ఫస్ట్ టైం ఈ స్థాయిలో డ్యాన్సులు చేశాను. ఇది సాల్సా స్టయిల్ డ్యాన్స్. నిజానికి ఇలాంటి డ్యాన్స్ చేయాలంటే పది, పదిహేనేళ్ల ప్రాక్టీస్ కావాలి. నాకు ఎంతో ఓపికగా నేర్పించి చేయించిన మా డాన్స్ మాస్టర్ కు థాంక్యూ. నా డ్యాన్స్ మీకు నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ పాట చేసినప్పుడు నా కండరాలు, వెన్నుపూస కూడా కొంచెం దెబ్బతిన్నాయి (నవ్వుతూ). కానీ ఫైనల్‌గా పాట చాలా అద్భుతంగా వచ్చింది. నాకు  స్క్రీన్‌పై మెగాస్టార్ చిరంజీవి గారి డ్యాన్స్‌లు చూడటం చాలా ఇష్టం. ఆయన ప్రపంచంలోనే గొప్ప డ్యాన్సర్లలో ఒకరు. ఈ పాటకు ‘దేశ సంచారి’ అనే లైన్ చాలా చక్కగా కుదిరింది. ఇదే సమయంలో మహేష్ బాబు గారి వారణాసి సినిమాలో కూడా ‘సంచారి’ అనే పాట ఉండటం యాదృచ్ఛికంగా జరిగిందని భావిస్తున్నాను. ఈ టైమింగ్‌ను దేవుడే సమకూర్చాడనిపించింది. ఈ సినిమాలో మొత్తం ఏడు గెటప్స్ ఉన్నాయి. అందులో నాకు చాలా ఇష్టమైనది రామప్ప గెటప్” అని చెప్పుకొచ్చారు.

Related posts