మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ విజయవంతమైన కాంబో మరోసారి చేతులు కలపడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే పొల్లాచ్చిలో మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న చిత్ర బృందం, సోమవారం హైదరాబాద్‌లో ఒక కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది. పొల్లాచ్చి షెడ్యూల్‌లో హై-వోల్టేజ్ యాక్షన్, ప్రధాన తారాగణం పాల్గొన్న కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ పూర్తి కావడాన్ని పురస్కరించుకుని ‘బిహైండ్-ది-సీన్స్’ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వీడియోలో సెట్స్‌లో ఉన్న ఉత్సాహభరితమైన వాతావరణం, ప్రతి సన్నివేశం…
Day: June 22, 2026
Accommodation concession should be provided to artistes in tourist places
– Deputy Chief Minister Mallu Bhatti Vikramarka – Ardhanarishwaram National dance festivals are off to a good start – Central Sangeet Natak Akademi award winners felicitated Telangana Deputy Chief Minister Mr Mallu Bhatti Vikramarka expressed happiness that the Telangana Sangeet Natak Akademi, which is recognized for its unique programmes, organized festivals at the national level and spread the fame of Telangana. The National Dance Festival under the auspices of Telangana Sangeet Natak Akademi started grandly at Ravindra Bharati on Monday. Talented artistes from different states participated in this festival organized…
పర్యాటక ప్రదేశాల్లో కళాకారులకు వసతి రాయితీ కల్పించాలి : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
– అర్ధనారీశ్వరం జాతీయ నృత్యోత్సవాలు శుభారంభం – కేంద్ర సంగీత నాటక అకాడమి పురస్కార విజేతలకు ఘన సత్కారాలు విలక్షణ కార్యక్రమాలతో గుర్తింపు పొందిన తెలంగాణ సంగీత నాటక అకాడమి జాతీయ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించి తెలంగాణ ఖ్యాటిని చాటి చెప్పడం అభినందనీయం అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం రవీంద్రభారతిలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ నృత్యోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్ధనారీశ్వరం పేరిట నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతిభ కలిగిన కళాకారులు పాల్గొన్నారు. ముఖ్యఅతిధిగా విచ్చేసిన మల్లు భట్టి విక్రమార్క జ్యోతి ప్రకాశనం చేసి ఉత్సవాలను ప్రారంభించారు. కళాకారులను గౌరవించుకోవడం అంటే సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రోత్సాహించడమే అని ఆయన అన్నారు. విశిష్ఠ అతిధిగా విచ్చేసిన సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి…
చివరి శ్వాస వరకు సినిమా కోసం పనిచేస్తూనే ఉంటా : ఫిలిం క్రిటిక్స్ ‘మీట్ ది ప్రెస్’లో దర్శక, నిర్మాత అల్లాణి శ్రీధర్
అల్లాణి శ్రీధర్ తెలుగు సినిమా రచయిత, నిర్మాత, దర్శకుడు. 1988లో ‘కొమరంభీమ్’ చిత్రంతో దర్శకత్వంలో అరంగేట్రం చేశారు. ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రంగా, ఉత్తమ దర్శకుడుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి 1990లో నంది అవార్డు అందుకున్నారాయన. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ అవార్డ్స్ విధివిధానాల కమిటీలో సభ్యునిగా పని చేశారు. అల్లాణి శ్రీధర్ పుట్టినరోజు (జూన్ 24.6.2026) సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆయనకు ఫిలింఛాంబర్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా అల్లాణి శ్రీధర్ మాట్లాడారు ఆ విశేషాలు ఆయన మాటల్లోనే… ”ఈ రోజు నా జన్మదినం అనేది గొప్పగా అనుకోవడం లేదు. నేడు ఈ వేదికపైన ఇంత మంది మిత్రులను కలుసుకోవడం నా జన్మదినం కాదుగాని.. పునర్జన్మదినంగా భావిస్తున్నాను. నేను ‘కొమరం భీమ్’ చేసే రోజుల్లో…
ప్రభాస్ రూల్స్ బ్రేక్..సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం!
వంగా చేస్తున్న సరికొత్త ప్రయోగం ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న హై-వోల్టేజ్ కాప్ డ్రామా ‘స్పిరిట్’ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతోంది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రాలన్నీ ఎక్కువగా గ్రీన్ స్క్రీన్స్, సీజీఐ, భారీ స్టూడియో సెట్లలోనే షూటింగ్ జరుపుకోగా.. వంగా మాత్రం ఇందుకు భిన్నంగా రియల్ లొకేషన్స్‌ను ఎంచుకున్నాడు. కృత్రిమ సెట్ల వల్ల ప్రభాస్ సహజసిద్ధమైన రా స్క్రీన్ ప్రెజెన్స్ దెబ్బతింటోందనే విమర్శలకు ఈ సినిమాతో చెక్ పెట్టబోతున్నాడు. ఇందులో భాగంగానే ‘స్పిరిట్’ షూటింగ్‌ను వంగా హైదరాబాద్ లోని అసలైన గల్లీల్లోకి తీసుకువచ్చాడు. కొద్దిరోజుల క్రితం నగరంలోని ఐకానిక్ విమల్ థియేటర్ వద్ద ఒక హై-ఆక్టేన్ సీక్వెన్స్‌ను షూట్ చేయగా, ప్రస్తుతం చంచల్‌గూడ సెంట్రల్ జైలులో ప్రభాస్‌పై ఒక కీలక షెడ్యూల్ రన్ అవుతోంది. సాధారణంగా…
మృణాల్ ప్రేమకథకు బ్రేక్!?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ సాగుతోంది. పలుమార్లు ఇద్దరూ కలిసి కనిపించడం, ఒకరి కుటుంబ సభ్యులతో మరొకరు సన్నిహితంగా ఉండడం వంటి అంశాలు ఈ రూమర్లకు మరింత బలం చేకూర్చాయి. అయితే తాజాగా ఈ జంట విడిపోయిందనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.గత ఏడాది ఆగస్టులో మృణాల్ నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ప్రీమియర్ షోలో ధనుష్, మృణాల్ కలిసి కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. అనంతరం ధనుష్ నటించిన ‘తేరే ఇష్క్ మే’ సినిమా పార్టీకి కూడా మృణాల్ హాజరుకావడం ఇద్దరి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉందనే చర్చలకు దారి తీసింది. అంతేకాకుండా, మృణాల్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ధనుష్ సోదరీమణులు…
