గ్లామర్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా ప్రస్తుతం హాట్ బాంబ్ లా మారిందని నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తున్నారు. వారు అలా ట్రోల్ చేయడంలో అర్ధం లేకపోలేదు. ఎందుకంటే ఇటీవల సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లను షేక్ చేసేస్తోంది. ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘జాతిరత్నాలు’లో అమాయకంగా నటించి ప్రేక్షకుల మెప్పును పొంది మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఆమె ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో ఓ చిన్న క్యారక్టర్ చేసింది. అక్కినేని నాగార్జున – నాగ చైతన్య తో కలిసి ‘బంగార్రాజు’లో ఆడిపాడింది. ఆ తర్వాత వరుసగా హీరోయిన్ గా మత్తువదలారా -2, ఆ ఒక్కటీ అడక్కులో నటించినా అనుకున్నంతగా కలిసి రాలేదు. తాజాగా ‘గాయపడ్డ సింహం’లో నటించింది. ”నేను ఏదైనా ఓ సినిమా ఒప్పుకోవాలంటే కథ, నా పాత్ర నచ్చాలి. ‘గాయపడ్డ సింహం’లో వ్లాగర్ షాలిని పాత్ర చేశాను. ఎంతగానో నచ్చింది. కశ్యప్ క్రియేట్ చేసిన యూనివర్స్, క్యారెక్టర్స్ అన్నీ చాలా హిలేరియస్‌గా వచ్చాయి. ‘గాయపడ్డ సింహం’ లో యాక్షన్, రొమాన్స్, కామెడీ.. ఇలా అన్ని అంశాలను కలిపి హిలేరియస్‌గా తెరకెక్కించారు. పూర్తి స్థాయి నిడివి ఉండే పాత్ర చేయాలని ఉంది. వచ్చే ఏడాది నేను ఓ సినిమాకి దర్శకత్వం కూడా వహిస్తాను.. కొన్ని కథలు రాస్తున్నాను. ప్రస్తుతం ‘భగవంతుడు’, ‘సిగ్మా’ సినిమాలు పూర్తి చేశాను. సత్యదేవ్ తో ఓ మూవీ చేస్తున్నాను. మరో రెండు సినిమాలు ప్రారంభం కాబోతున్నాయి” అంటూ చెప్పుకొచ్చింది.
ఫరియా అబ్దుల్లా : హాట్ బాంబ్!
