టాలీవుడ్ ప్రేక్షకులు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూసిన సినిమాల్లో ‘పెద్ది’ ఒకటి. రెండో సినిమానే రామ్‌చరణ్‌ను డైరెక్ట్ చేసే అవకాశం బుచ్చిబాబుకు రావడం, బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ కథానాయికగా నటించడం, ఏఆర్ రెహమాన్ సంగీతం, జగపతిబాబు, దివ్యేందు శర్మ, శివ రాజ్‌కుమార్ సహా చాలామంది నటీనటులు ఇతర కీలక పాత్రలలో నటించడం.. ఇలా అన్నీ ఈ సినిమాపై అంచనాలను పెంచాయి. సోలో హీరోగా రామ్‌చరణ్ హిట్టు అందుకొని ఎనిమిదేళ్లు దాటిపోయింది. కమర్షియల్ ఫార్ములాతో చేసిన ‘గేమ్ ఛేంజర్’తో పాటు గత సినిమాలు అంతగా ఈ మెగా హీరోకు అచ్చి రాలేదు. సక్సెస్ కోసం తన మాస్ ఇమేజ్‌ను పక్కనపెట్టి రామ్‌చరణ్ చేసిన పాన్ ఇండియా చిత్రమిది. ‘ఉప్పెన’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఐదేళ్ల గ్యాప్‌తో బుచ్చిబాబు తీసిన సినిమా కూడా ఇదే. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన…
