Audience praises Dharma Mahesh for his performance ‘Drinker Sai’ is a film directed by Kiran Tirumalasetty and produced by Basavaraju Srinivas, Ismail Sheikh and Basavaraju Laharidhar under the banners of Everest Cinemas and Smart Screen Entertainments. The film, which was released in theaters with the tagline “Brand of Bad Boys”, has impressed the youth and mass audience and garnered positive talk. Now it is continuing its success on OTT as well. Streaming on Zee5 OTT platform, this film is currently the top-1 trending movie in the Free on Zee5 category…
Month: May 2026
జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ‘డ్రింకర్ సాయి’..ధర్మ మహేష్ నటనకు ప్రేక్షకుల ప్రశంసలు
ధర్మ మహేష్ హీరోగా కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్ర్కీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’. “బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్” అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై యూత్, మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలోనూ తన విజయయాత్రను కొనసాగిస్తోంది. జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఫ్రీ ఆన్ జీ5 విభాగంలో టాప్-1 ట్రెండింగ్ మూవీగా దూసుకుపోతూ ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటోంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో ధర్మ మహేష్ కనబరిచిన అద్భుత నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. భావోద్వేగాలు, ప్రేమ, ఆవేశం, బాధ, తిరుగుబాటు స్వభావం వంటి…
‘పెద్ది’ ఇండస్ట్రీ గర్వపడేలా చేస్తుంది: చెన్నై ప్రెస్ మీట్ లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర బృందం చెన్నైలో గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. చెన్నై ప్రెస్ మీట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. చెన్నై మీడియాకు నమస్కారం. ‘మగధీర’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల ప్రమోషన్స్ కోసం చెన్నైకి వచ్చాను.…
‘రిస్క్’ అందరినీ అలరించే యూత్ ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. మంచి మ్యూజిక్, యాక్షన్ తో పాటు థ్రిల్ ఉంటుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సందీప్ అశ్వ
సంపంగి,16 వంటి చిత్రాలకు చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించిన ఘంటాడి కృష్ణ స్వీయ సంగీత దర్శక నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘రిస్క్’. సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ రెండో వారంలో ఈ సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఈ వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. రిస్క్.. టైటిల్ చాలా బాగుంది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాను థియేటర్‌లో చూడాలని నిర్ణయించుకున్నాను. ఇది యువతకు బాగా నచ్చే సినిమా అనిపిస్తోంది. చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. ట్రైలర్‌లోని విజువల్స్ చాలా బాగున్నాయి. ట్రైలర్ చూస్తున్నంతసేపు ఉత్కంఠగా…
అభిరుచి గల డైరెక్టర్ రవిచరణ్ : స్ట్రాంగ్ విజన్ తో క్రియేటివిటీ కి పెద్ద పీట!
రవిచరణ్ ఒక కొత్త అభిరుచి గల డైరెక్టర్, తన దర్శకత్వ శైలి చాలా సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది, అందుకు ఉదాహారణే నల్లమల మూవీ సాధించిన విజయం, ఆ మూవీ ఎంతగా విమర్శకుల ప్రశంసలు పొందిందో కూడా మనందరకీ తెలిసిన విషయామె, రవిచరణ్ ఏదైనా సబ్జెక్టు ఎంచుకోవాలి అనుకుంటె స్ట్రాంగ్ విజన్ తో సినిమా ని రియలస్టిక్ గా ఉండే విధంగా చూసుకుంటారు.. వీటితో పాటు ఇప్పటి ప్రేక్షకులు ఏదైతే కోరుకుంటారో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా చూసుకోవటం తన ప్రత్యేకత. తన లోని దర్శకుడు ఎప్పుడు ప్రతి క్యారెక్టర్ కి పవర్ ఫుల్ జర్నీ ఆ క్యారెక్టర్ కు సంబంధించిన వాయిస్ ని రిఫలెక్ట్ చేస్తూ ముందుకు సాగుతుంది. క్రియేటివిటీ కి పెద్ద పీట వేసే రవిచరణ్ నుంచి అతి త్వరలో రెండు భిన్న మయిన…
కియారా రూటే వేరు..!
బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ రూటే వేరు. తను చేస్తున్న చిత్రాలయితేనేమి.. పోషిస్తోన్న పాత్రలయితేనేమి.. వేటికవే భిన్నంగా ఉంటూ ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తున్నాయి. తాజాగా ఈ అమ్మడు యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో యశ్‌తో పాటు ఐదుగురు హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నదియా పాత్రలో కియారా కనిపించనుండగా హ్యుమా ఖురేషీ, ఎలిజిబెత్‌గా, నయనతార గంగ పాత్రలో, రెబెకాగా తారా సుతారియా అలరించనున్నారు. మెలిసా అనే పాత్రలో రుక్మిణి వసంత్ కూడా నటిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కియారా టాక్సిక్ సెట్‌లో తన అనుభవాన్ని పంచుకున్నారు. సెట్‌లోకి అడుగుపెట్టగానే ఎవరికీ ‘హాయ్, హలో’ చెప్పొద్దని దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తనకు స్పష్టమైన…
వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’
* జూన్ 19 నుంచి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ జియో హాట్ స్టార్‌లో ‘సేవ్ ది టైగర్స్’కి వచ్చిన స్పందన అందరికీ తెలిసిందే. ఇప్పటికే రెండు సీజన్లు బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి. ఇక ఇప్పుడు మూడో సీజన్ స్ట్రీమింగ్‌కి రెడీ అయింది. జూన్ 19 నుంచి ఈ మూడో సీజన్ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో అందరినీ ఆకట్టుకునేలా, వినోదభరితమైన ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ఎవరన్నా.. చిన్నప్పటి నుంచి పెళ్లి గురించి మనకు ఇన్ని అబద్దాలు చెప్పింది.. పెళ్లి అంటే పండు వెన్నెల, పెళ్లాం అంటే నిండు పున్నమి’ అని రాహుల్ పాత్రలో అభినవ్ గోమటం చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ఓపెన్ అవుతుంది. బార్‌లో రాహుల్ (అభినవ్ గోమటం), విక్రమ్ (కృష్ణ చైతన్య), ఘంటా రవి (ప్రియదర్శి) ముగ్గురూ…
TFCC Short Film Festival Awards – 2026 Announced to Encourage Young Talent: TFCC Chairman Dr. Prathani Ramakrishna goud
* Free Entry Submission Open Until June 13 * Grand Awards Ceremony to be Held on June 21 at Prasad Labs, Hyderabad The Telangana Film Chamber of Commerce (TFCC) has come forward to encourage emerging talent in the film industry. Marking the 12th Telangana Formation Day celebrations, TFCC Chairman Dr. Prathani Ramakrishna Goud officially announced the “TFCC Short Film Festival Awards – 2026.” There is no entry fee for participation in the festival. Aspiring filmmakers, actors, and technicians can submit their short films with a duration ranging from 5 to…
యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు “టీఎఫ్‌సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ – 2026” నిర్వహిస్తున్నాం : టీఎఫ్‌సీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్
* జూన్ 13 వరకు ఉచితంగా ఎంట్రీలు పంపే అవకాశం * జూన్ 21న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో అవార్డుల ప్రధానోత్సవం చిత్ర పరిశ్రమలో కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ముందుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని “టీఎఫ్‌సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ – 2026” ను టీఎఫ్‌సీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ ప్రకటించారు. ఈ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. 5 నుంచి 25 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలింలను ఔత్సాహిక దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు పంపవచ్చు. ఎంట్రీలను జూన్ 13వ తేదీ వరకు స్వీకరిస్తారు. జ్యూరీ ఎంపిక చేసిన విజేతలకు జూన్ 21న హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా…
‘విశ్వంభర’కు మోక్షం ఎప్పుడు? .. కొత్త రిలీజ్ ప్లాన్‌పై క్లారిటీ లేదు
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ, సినిమా విడుదల మాత్రం ఆలస్యమవుతూనే ఉంది. ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయాలని మేకర్స్ భావించినా, తాజా పరిస్థితుల ప్రకారం అది కష్టంగానే కనిపిస్తోంది. చిత్రానికి సంబంధించిన కీలకమైన విఎఫ్ఎక్స్ పనులు ఇంకా పెండింగ్‌లో ఉండటమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం హరి గౌర బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు, ఈ సినిమా ఓటీటీ డీల్‌ను ముగించడం మేకర్స్‌కు పెద్ద సవాలుగా మారింది. విఎఫ్ఎక్స్ షాట్స్ పూర్తికాగానే ఫైనల్ ఎడిటింగ్‌ను లాక్ చేసి, టాప్ డిజిటల్ సంస్థలకు ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ డిజిటల్ బిజినెస్ క్లోజ్ అయిన తర్వాతే అధికారిక విడుదల తేదీపై స్పష్టత రానుంది. ప్రస్తుతానికైతే ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ ప్లాన్‌పై క్లారిటీ లేదు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలు…
