‘రిస్క్’ అందరినీ అలరించే యూత్ ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. మంచి మ్యూజిక్, యాక్షన్ తో పాటు థ్రిల్ ఉంటుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సందీప్ అశ్వ

'Risk' is a youthful commercial entertainer that will entertain everyone. It will have good music, action and thrill: Hero Sandeep Ashwa at the trailer launch event
'Risk' is a youthful commercial entertainer that will entertain everyone. It will have good music, action and thrill: Hero Sandeep Ashwa at the trailer launch event
Spread the love

సంపంగి,16 వంటి చిత్రాలకు చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించిన ఘంటాడి కృష్ణ స్వీయ సంగీత దర్శక నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘రిస్క్’. సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ రెండో వారంలో ఈ సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఈ వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. రిస్క్.. టైటిల్ చాలా బాగుంది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాను థియేటర్‌లో చూడాలని నిర్ణయించుకున్నాను. ఇది యువతకు బాగా నచ్చే సినిమా అనిపిస్తోంది. చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. ట్రైలర్‌లోని విజువల్స్ చాలా బాగున్నాయి. ట్రైలర్ చూస్తున్నంతసేపు ఉత్కంఠగా అనిపించింది. ఇంకా చూడాలనిపించింది. ఇంత ఉత్కంఠభరితంగా సినిమాను తెరకెక్కించిన దర్శకుడికి, నటీనటులకు, నిర్మాతలకు అభినందనలు. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
హీరో సందీప్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. యాక్టింగ్ అంటే ప్యాషన్. చిన్న చిన్న మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఇక్కడి వరకు వచ్చాను. వెండితెరపై నన్ను నేను చూసుకోవడానికి దాదాపు పదేళ్లు పట్టింది. దీన్నే నా తొలి విజయంగా భావిస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదాలతో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ‘రిస్క్’ సినిమా జర్నీ నాకు చాలా మంచి అనుభవాన్ని ఇచ్చింది. అహర్నిశలు కష్టపడి ఈ సినిమా చేశాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఇది. లవ్, ఎమోషన్, ఫైట్స్, యాక్షన్, మ్యూజిక్ అన్నీ ఇందులో ఉంటాయి. ఫస్ట్ హాఫ్‌లో ఫ్రెండ్‌షిప్, కామెడీ, లవ్ ఉంటే.. సెకండ్ హాఫ్ థ్రిల్లింగ్‌గా సాగుతుంది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరూ అద్భుతమైన నటన కనబరిచారు. రాజీవ్ కనకాల గారు, దువ్వాసి మోహన్ గారు, అనీష్ కురువిల్లా గారు, కాదంబరి కిరణ్ గారు వంటి సీనియర్ నటులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. మా డీవోపీ జగదీష్ గారు అద్భుతమైన విజువల్స్ అందించారు. ఇందులోని పాటలన్నీ ఎంతో మంచి క్వాలిటీతో ఉంటాయి. ఘంటాడి కృష్ణ గారు అద్భుతమైన సంగీతం అందించారు. ఆయన పాటలతోనే కథ చెప్పారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమాను జూన్ రెండో వారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ కావాలి. ఈ సినిమా మిమ్మల్ని తప్పకుండా ఎంటర్‌టైన్ చేస్తుంది.

దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నా ఆశ నా శ్వాస సంగీతం. 16మ ‘సంపంగి’ వంటి చిత్రాల్లో నా పాటలతో ఎంతోమందికి దగ్గరయ్యాను. ఆ పాటల ద్వారానే ప్రేక్షకులు నన్ను గుర్తిస్తున్నారు. ఆ ప్రేమ నాకు చాలానే. దర్శకుడిగా ఇది నా తొలి చిత్రం. సినిమా చాలా బాగా వచ్చింది. మొదట ఈ చిత్రానికి ‘16-2’ అనే టైటిల్ అనుకున్నాం. కానీ ‘రిస్క్’ అనే టైటిల్ బాగుంటుందని మా హీరో సందీప్ సూచించారు. సందీప్ గారు ఎంతో అంకితభావంతో పనిచేశారు. ఆయన కష్టపడిన తీరు అద్భుతం. అందరి సహకారంతో సినిమా చాలా బాగా వచ్చింది. జూన్ రెండో వారంలో సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ చిత్రానికి మంచి పాటలు అందించాను. మ్యూజికల్‌గా కూడా సినిమా ప్రేక్షకులకు మరింత చేరువ అవుతుంది. ఈ సినిమాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా సినిమాను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.
30 ఇయర్స్ పృథ్వి మాట్లాడుతూ.. ఘంటాడి కృష్ణ గారు ఎన్నో ఎవర్‌గ్రీన్ పాటలు అందించిన మ్యూజిక్ డైరెక్టర్. ఆయన పాటలు ఇప్పటికీ ప్రేక్షకులు వింటూనే ఉన్నారు. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. మంచి టీమ్‌తో ఈ సినిమా రూపొందింది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. అందరూ ఈ సినిమాను ఆదరించి మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను.
మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఘంటాడి కృష్ణ గారు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎన్నో మంచి పాటలతో మనందరినీ అలరించారు. ఇప్పుడు దర్శకుడిగా వస్తున్నారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సినిమా అనేది రిస్క్‌తో కూడుకున్న వ్యాపారం. అలాంటి ‘రిస్క్’ అనే టైటిల్‌తో ఈ సినిమా రావడం ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్ చాలా వినోదాత్మకంగా అనిపించింది. టెక్నికల్‌గా కూడా సినిమా చాలా బాగుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఇలాంటి మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి. సందీప్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఈ సినిమా అందరినీ అలరించాలని కోరుకుంటున్నాను.
ఆషు రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ ట్రైలర్ చాలా క్యూరియాసిటీని కలిగించింది. సినిమా చూడాలనే ఆసక్తిని పెంచింది. సందీప్ ఈ స్థాయికి రావడం చాలా ఆనందంగా ఉంది. తను చాలా కష్టపడ్డాడు. తనకు అభినందనలు. ఈ సినిమాను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ ఈవెంట్ లో మూవీ టీం అంతా పాల్గొన్నారు.
తారాగణం: సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్, జోయా జవేరి, రాజీవ్ కనకాల,అనీష్ కురువిల్లా, తరుణ్ సాగర్, రవీంద్రనాథ్ ఠాగూర్ తదితరులు
దర్శకత్వం & సంగీతం: గంటాడి కృష్ణ
బ్యానర్: GK మిరాకిల్స్
DOP: జగదీష్ కొమారి
ఎడిటర్: శివ శరణ్
స్టంట్స్: శంకర్ మాస్టర్
కొరియోగ్రాఫర్: రఘు, విజయ్ పోలాకి
పీఆర్వో: తేజస్వి సజ్జా