పొల్లాచ్చిలో ‘చిరు158’ హై-ఎనర్జీ షెడ్యూల్‌ పూర్తి

High-energy schedule of 'Chiru 158' wrapped up in Pollachi.

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌ లో ‘చిరు158’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ విజయవంతమైన కాంబో మరోసారి చేతులు కలపడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పలు భాషల్లో భారీ విజయాలు అందుకున్న కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు ఇది తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా తమిళనాడులోని పొల్లాచ్చిలో జరిగిన హై-ఎనర్జీ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవి, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.   ‘చిరు158’ కోసం దర్శకుడు బాబీ కొల్లి భారీ…