జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ‘డ్రింకర్ సాయి’..ధర్మ మహేష్ నటనకు ప్రేక్షకుల ప్రశంసలు

‘Drinker Sai’ is trending top-1 on Zee5.. Audience praises Dharma Mahesh’s performance
‘Drinker Sai’ is trending top-1 on Zee5.. Audience praises Dharma Mahesh’s performance
Spread the love

ధర్మ మహేష్ హీరోగా కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్ర్కీన్ ఎంటర్‌‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’. “బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్” అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై యూత్, మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలోనూ తన విజయయాత్రను కొనసాగిస్తోంది. జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఫ్రీ ఆన్ జీ5 విభాగంలో టాప్-1 ట్రెండింగ్ మూవీగా దూసుకుపోతూ ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటోంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో ధర్మ మహేష్ కనబరిచిన అద్భుత నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. భావోద్వేగాలు, ప్రేమ, ఆవేశం, బాధ, తిరుగుబాటు స్వభావం వంటి విభిన్న కోణాలను ఆయన ఎంతో సహజంగా పండించారని ఆడియెన్స్ అభిప్రాయపడుతున్నారు. సినిమా మొత్తం తన భుజాలపై మోస్తూ పాత్రలో పూర్తిగా లీనమైన ధర్మ మహేష్ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఈ సినిమాలో ఒక సాధారణ యువకుడి జీవితంలో జరిగే పరిణామాలను, అతని ప్రేమ, ఆత్మగౌరవం, భావోద్వేగ సంఘర్షణలను ధర్మ మహేష్ ఎంతో నేచురల్‌గా నటించారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అందుకే థియేటర్లలో మంచి పేరు తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో మరింత పెద్ద స్థాయిలో ఆదరణ పొందుతోంది. అలాగే ఈ చిత్రంతో బెస్ట్ డెబ్యూ యాక్టర్‌‌గా దుబాయ్‌లో జరిగిన గామా అవార్డ్ అందుకున్నారు ధర్మ మహేష్.
హీరోయిన్‌గా నటించిన ఐశ్వర్య శర్మ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఆమెకు ధర్మ మహేష్‌తో ఉన్న కెమిస్ట్రీ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అలాగే రీతూ చౌదరి, పోసాని కృష్ణ మురళీ, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, భద్రం, కిర్రాక్ సీత, ఫన్ బకెట్ రాజేష్, రాజ ప్రజ్వల్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసి కథను మరింత బలపరిచారు.
టెక్నికల్‌గా కూడా ‘డ్రింకర్ సాయి’ మంచి మార్కులు సాధించింది. దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి కథను నేటి యువతకు కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించడంలో విజయం సాధించారు. ముఖ్యంగా భావోద్వేగాలు, ప్రేమ కథ, వినోదం వీటన్నింటినీ బ్యాలెన్స్ చేశారు. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా నిర్మాణ విలువలను మెరుగ్గా అందించారు.
ఇక సంగీత దర్శకుడు శ్రీవసంత్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేక బలం అయ్యాయి. విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రంలోని పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. కథలోని భావోద్వేగాలను మరింత ప్రభావవంతంగా ప్రేక్షకులకు చేరవేయడంలో సంగీతం కీలక పాత్ర పోషించింది.
ప్రస్తుతం జీ5లో టాప్ ట్రెండింగ్ స్థానాన్ని దక్కించుకున్న ‘డ్రింకర్ సాయి’కి వస్తున్న స్పందన చూస్తుంటే, ధర్మ మహేష్ నటనకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రశంసలు ఆయన కెరీర్‌లో ఈ సినిమాను ఒక ప్రత్యేక మైలురాయిగా నిలబెడుతున్నాయి. ఓటీటీ ప్రేక్షకులు భారీగా వీక్షిస్తున్న నేపథ్యంలో ‘డ్రింకర్ సాయి’కి రోజురోజుకీ మరింత ఆదరణ పెరుగుతుండటం విశేషం. ప్రస్తుతం జీ5లో ఫ్రీగా అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని ఇంకా చూడని వారు తప్పకుండా చూడాలని టీమ్ కోరుకుంటోంది.