ప్రముఖ తమిళ చలనచిత్ర దర్శకులు, పదహారేళ్ల వయసు, సీతాకోకచిలుక, ఆరాధన వంటి ఎన్నో కళాత్మక కమర్షియల్ చిత్రాల సృష్టికర్త, ఎందరో నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని వెండితెరకు పరిచయం చేసిన దిగ్దర్శకులు భారతీరాజా ఇకలేరు అన్న విషయం జీర్ణించుకోవడం చాలా కష్టం. కళామతల్లికి తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు సద్గతులు కలగాలని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సంతాపాన్ని ప్రకటించింది. ఈ మేరకు అధ్యక్షులు బత్తుల జెవి ప్రసాద్ రావు, కార్యదర్శి సురేష్ కొండేటి ఒక ప్రకటన విడుదల చేస్తూ.. తమిళ, తెలుగు చిత్రాలపై భారతీరాజా తనదైన ముద్ర వేశారు. గ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల జీవనం, ప్రేమానుబంధాలను, టీనేజర్స్ కి ఉండే ఆకర్షణలు లాంటివి చూపించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనది. ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ ఇప్పటికీ చూడదగ్గ విధంగా ఉంటుంది. ఆ చిత్రంలోని పాటలు,…
Day: June 10, 2026
ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత
ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం పరిస్థితి విషమించడంతో చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1941 జులై 17న జన్మించిన భారతీరాజా 1977లో వచ్చిన తమిళ మూవీ ‘16 వయథినిలే’ (తెలుగులో పదహారేళ్ల వయసు) తో దర్శకుడిగా మారారు. ‘కొత్త జీవితాలు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తెలుగులోనూ పలు క్లాసిక్ సినిమాలను తెరకెక్కించి లెజెండరీ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్‌లుగా నిలిచాయి. ‘సీతాకోకచిలుక’కు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును అందుకున్నారు. ‘మంగమ్మగారి మనవడు’కు కథను, ‘పల్నాటి పౌరుషం’ చిత్రానికి స్క్రీన్‌ప్లేను అందించారు. ఇటీవల మోహన్‌లాల్ నటించిన ‘తుడురమ్’ సినిమాలో భారతీరాజా చివరిసారిగా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించారు.…
