మే 22న థియేటర్లలోకి వరలక్ష్మి, నవీన్ చంద్రల ‘పోలీస్ కంప్లైంట్’

‘Police Complaint’ starring Varalaxmi Sarathkumar and Naveen Chandra to hit theatres on May 22

▪️ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో హారర్–యాక్షన్ థ్రిల్లర్ ▪️ న‌టుడు కృష్ణ‌సాయి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సూప‌ర్ స్టార్ కృష్ణ‌పై స్పెష‌ల్ సాంగ్ విడుద‌ల‌ ▪️ 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో భారీ స్థాయిలో నిర్మాణం ▪️ వరలక్ష్మి శరత్‌కుమార్ కొత్త షేడ్స్ – నవీన్ చంద్ర వెర్సటైల్ రోల్ ▪️ విభిన్న కథ, పవర్‌ఫుల్ పాత్రలతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ విలనిజం అయినా, క్యారెక్టర్ రోల్ అయినా.. తనదైన పవర్‌ఫుల్ నటనతో స్క్రీన్‌పై మ్యాజిక్ చేసే నటి వరలక్ష్మి శరత్‌కుమార్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో వెర్సటైల్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ చంద్ర. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ సరికొత్త, భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో డైరెక్ట‌ర్ సంజీవ్ మేగోటి తెరకెక్కించిన తాజా చిత్రం…

‘జెట్లీ’ రోరింగ్ టేక్ ఆఫ్ మీట్‌

'Jaitley' roaring take off meat

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, రితేష్ రానా సమ్మర్ బ్లాక్ బస్టర్ ‘జెట్లీ’. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పించింది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసింది. వెన్నెల కిషోర్, అజయ్ కీలక పాత్రలు పోషిసించారు. మే 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయంతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ రోరింగ్ టేక్ అఫ్ మీట్ నిర్వహించారు. రోరింగ్ టేక్ ఆఫ్ మీట్‌లో డైరెక్టర్ రితేష్ రానా మాట్లాడుతూ.. చెర్రీ గారిని కలసి పదేళ్లు అవుతోంది. ఆయనకి మొదట ‘మత్తు వదలరా’ స్టోరీ చెప్పాను.మా టీమ్ అందరినీ నమ్మి మాకు…

మ్యూజికల్ ఫాంటసీ : ‘సింగ్ గీతం’ జూన్ 11న రిలీజ్

Musical fantasy: 'Sing Geetam' to release on June 11th

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు. దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్‌లో, పలు భాషల్లో దాదాపు అరవై చిత్రాలతో ఇండియన్ సినిమాని రీడిఫైన్ చేసిన సంగీతం, 94 ఏళ్ల వయసులో డైరెక్టర్ చైర్ లోకి తిరిగి వస్తూ, సృజనాత్మకతకు హద్దులు లేవని మరోసారి నిరూపిస్తున్నారు.  ఐకానిక్ మూకీ చిత్రం ‘పుష్పక్’ నుంచి  విజనరీ సైన్స్ ఫిక్షన్ క్లాసిక్ ‘ఆదిత్య 369’ వరకు ఆయన క్రియేటివిటీకి పర్యాయపదంగా నిలిచారు. కమల్ హాసన్‌తో ఆయన చేసిన ‘విచిత్ర సహోదరులు’,  ‘మైఖేల్ మదన కామరాజన్’ బెంచ్ మార్క్ సినిమాలుగా నిలిచాయి. ఇప్పుడు, భారతదేశపు మొట్టమొదటి మ్యూజికల్ ఫాంటసీగా రూపొందించిన ‘సింగ్ గీతం’తో అలరించబోతున్నారు. ఈ చిత్రం సంగీతం, మ్యాజికల్ రియలిజంను మేళవించి ఓ యూనిక్ అనుభూతిని అందిస్తుంది. వైజయంతి మూవీస్, స్వప్న…

శ్రీనిధి శెట్టి : పాన్ ఇండియా బ్యూటీ…

Srinidhi Shetty: Pan India Beauty...

‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి ఓ నటిగా అన్ని రకాల జానర్‌ సినిమాలు చేయాలనుకుంటోంది. యశ్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్‌తోనూ అభిమానులను ఆకట్టుకుంది. ‘కేజీఎఫ్’ తర్వాత నాని హీరోగా వచ్చిన ‘హిట్ -3’లో కనిపించింది. ఇటీవల ఓ సందర్భంలో రణ్‌బీర్ కపూర్‌, సాయి పల్లవి జంటగా వస్తోన్న రామాయణ చిత్రంలో ఛాన్స్‌ గురించి క్లారిటీ ఇచ్చింది. సీతగా సాయి పల్లవి చేస్తోన్న రోల్‌ను రిజెక్ట్‌ చేశానన్న వార్తలపై స్పందించింది. ఆడిషన్‌కు వెళ్లిన మాట నిజమే కానీ.. తాను ఆ పాత్రకు ఎంపిక కాలేదని తెలిపింది. సీత రోల్‌కు ఎవరైతే సెట్‌ అవుతారో నిర్మాతలు డిసైడ్‌ చేశారని వెల్లడించింది. ఆ మూవీ ఆడిషన్‌కు వెళ్లడమే తనకు గొప్ప గౌరవమని ఆనందం వ్యక్తం చేసింది. అంత పెద్ద రోల్‌కు నేను ఆడిషన్…