‘జెట్లీ’ రోరింగ్ టేక్ ఆఫ్ మీట్‌

'Jaitley' roaring take off meat
Spread the love

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, రితేష్ రానా సమ్మర్ బ్లాక్ బస్టర్ ‘జెట్లీ’. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పించింది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసింది. వెన్నెల కిషోర్, అజయ్ కీలక పాత్రలు పోషిసించారు. మే 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయంతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ రోరింగ్ టేక్ అఫ్ మీట్ నిర్వహించారు.
రోరింగ్ టేక్ ఆఫ్ మీట్‌లో డైరెక్టర్ రితేష్ రానా మాట్లాడుతూ.. చెర్రీ గారిని కలసి పదేళ్లు అవుతోంది. ఆయనకి మొదట ‘మత్తు వదలరా’ స్టోరీ చెప్పాను.మా టీమ్ అందరినీ నమ్మి మాకు తొలి అవకాశం ఇచ్చారు. నాకు ఆయనపై ఎప్పుడూ కృతజ్ఞత వుంటుంది. నాకు రొటీన్‌కు భిన్నంగా ఉండే సినిమాలు చేయాలని ఉంటుంది. అలాంటి ఐడియాలు ఎప్పుడూ చెప్పినా, నాకంటే ఆయన ఎక్కువ ఎక్సైట్ అయి సినిమాలు చేశారు. ‘జెట్లీ’ కథ కూడా అలాగే చెప్పాను, ఆయనకి చాలా నచ్చింది.సినిమాను ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారు. నా డైరెక్షన్ టీమ్ అందరికీ థాంక్యూ. ఈ స్టోరీ ఐడియా ఇచ్చిన జయేంద్రకు థాంక్యూ. కొత్త మ్యూజిక్ మ్యూజిక్ ఇచ్చిన కాలభైరవకు ధన్యవాదాలు. మా ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ గారికి, డీఓపీ సురేష్ సారంగం గారికి థాంక్యూ. మా ప్రొడక్షన్ డిజైనర్ నార్ని శ్రీనివాస్ గారు ఫ్లైట్ సెట్‌ను చక్కగా డిజైన్ చేశారు. కిషోర్ గారికి, కబీర్ సింగ్ గారికి, రియాకు అందరికీ థాంక్స్. నాకు సత్య అంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని నేను ప్రతి సినిమాలో చూపిస్తూనే ఉన్నాను. ఈ సినిమాలో ఇంకొంచెం ఎక్కువగా చూపించాను. అది మీ అందరికీ నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. మేము థియేటర్ విజిట్స్‌కు వెళ్లినప్పుడు ప్రేక్షకుల స్పందన చూసి చాలా ఆనందంగా అనిపించింది. చెర్రీ గారికి, హేమలత గారికి, నవీన్ గారికి, రవి గారికి థాంక్యూ.
హీరో సత్య మాట్లాడుతూ నన్ను రితేష్ ని నమ్మి థియేటర్లకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి ధన్యవాదాలు. నిన్న థియేటర్లకు వెళ్లి ప్రేక్షకుల రెస్పాన్స్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. వాళ్ల ప్రేమ చూసి చాలా ఎమోషనల్ అయ్యాను. మీ మీద కూడా నాకు అంతే ప్రేమ ఉంటుంది. ఈ సినిమాలో పని చేసిన ఆర్టిస్టులు అందరికీ థాంక్యూ. కిషోర్ అన్నతో ఏ సినిమా చేసినా నేను చాలా ఎంజాయ్ చేస్తాను. అజయ్ అన్న నాకు సొంత అన్నయ్యలాంటివారు. నా జర్నీలో నాకు ఎంతో సపోర్ట్ చేశారు. డైరెక్టర్ రితేష్‌కు థాంక్యూ. తను ఎలాంటి క్యారెక్టర్ డిసైడ్ చేసినా అది స్పెషల్‌గా ఉంటుంది. చెర్రీ గారికి థాంక్యూ. అలాగే అనన్యకు కూడా థాంక్యూ. మా ప్రొడక్షన్ డిజైనర్‌కు, కెమెరామెన్ సురేష్ సారంగం గారికి థాంక్యూ. ఈ సినిమా కోసం కాలభైరవ అన్న స్పెషల్ మ్యూజిక్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాకు పని చేసిన ప్రతి టెక్నీషియన్‌కు ధన్యవాదాలు.
నిర్మాత చెర్రీ మాట్లాడుతూ ఎవరూ చేయని అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాతో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ‘జెట్లీ’తో అది సాధ్యమైంది. ఈ సినిమా ప్రేక్షకుల మధ్య సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి యూనానిమస్‌గా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. కలెక్షన్స్ కూడా బావున్నాయి. మొదటి రోజు కొన్ని కారణాల వల్ల కొన్ని స్క్రీన్స్‌లో సినిమా స్క్రీన్ కాలేదు. ఈరోజు నుంచి అవి కూడా మొదలవుతున్నాయి కాబట్టి ఇంకా బెటర్ అవుతుంది. ఈ సమ్మర్‌లో ‘జెట్లీ’ ఒక కూల్ మూవీగా ఆడియన్స్ చెబుతున్నారు. రితేష్ రానా జోనర్.. ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్లింది. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సత్య ఈ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. థియేటర్లలో అందరూ ‘హీరో.. హీరో’ అని అరుస్తున్నారు. అజయ్, రియా సింఘా అందరూ అద్భుతంగా చేశారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఇంకా చూడని వారు తప్పకుండా థియేటర్లలో చూడాలని కోరుతున్నాను. మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీడియాకు ధన్యవాదాలు.
యాక్టర్ అజయ్ మాట్లాడుతూ ఇది రితేష్ రానా జోనర్ సినిమా. నేను రితేష్‌కు పెద్ద ఫ్యాన్‌ని. చెర్రీ గారు చాలా ప్యాషన్‌తో ఈ సినిమా చేశారు. సినిమా మంచి సక్సెస్ సాధించింది. సత్య చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. తన సక్సెస్ చూసి చాలా ఆనందంగా ఉంది. రితేష్ కోసం ఎప్పుడైనా సినిమా చేయడానికి సిద్ధంగా ఉంటాను. చెర్రీ గారు, టీమ్ అందరూ నాకు కుటుంబంలాంటివారు. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. టార్గెట్ ఆడియన్స్‌కు ఈ సినిమా చాలా నచ్చింది.
గుండు సుదర్శన్ మాట్లాడుతూ ‘జెట్లీ’ అవుట్ అండ్ అవుట్ రితేష్ రానా జోనర్ సినిమా. న్యూ జనరేషన్ ఆడియన్స్‌తో పాటు అందరూ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఆడియన్స్‌తో పాటు మీడియా నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సత్య, రితేష్ కు మంచి ఫ్యాన్ బేస్ వుంది. పిల్లలు కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే ఫ్యామిలీస్ అందరూ పిల్లలతో కలిసి థియేటర్లకు వెళ్లాలని కోరుకుంటున్నాను.

Related posts