తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా నూతన చిత్రం ‘రెటీనా’ ప్రారంభం

New film 'Retina' launched by Tammareddy Bharadwaj
Spread the love

అల్లం రాజు దర్శకత్వంలో మనీష్, సోనియానాయుడు, ప్రీతీ హెస్సోనా హీరో హీరోయిన్లుగా పార్వతి సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 చిత్రం ఆదివారం రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్బంగా జరిగిన ప్రారంభోత్సవంలో ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మూహూర్తం షాట్ పై క్లాప్ నివ్వగా, ‘రజాకార్’ దర్శకుడు యాట సత్యనారాయణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్ కు ‘కమిటీ కుర్రోళ్ళు’ఫేమ్ యశ్వంత్ పెండ్యాల దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి పార్వతి నిర్మాత. ఈ సందర్బంగా ‘రజాకార్’ దర్శకుడు యాట సత్యనారాయణ మాట్లాడుతూ … ఈ సినిమా కథ నేను విన్నాను. చాలా బావుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా కథతో ప్రయాణం చేస్తారు. సినిమా దర్శకుడు అల్లం రాజుఎంతో చక్కగా ఈ సినిమాని తెరకెక్కిస్తాడన్న నమ్మకం నాకుంది” అన్నారు. దర్శకుడు అల్లం రాజు మాట్లాడుతూ.. ” రిటీనా చిత్ర ప్రారంభోత్సవానికి హాజరైన సినీ ప్రముఖులందరికీ కృతజ్ఞతలు. హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ వస్తుంది. అలాంటి సక్సెస్ రావాలంటే సినిమా అన్ని వర్గాల వారికి నచ్చేలా ఉండాలి. మా పార్వతి సినిమాస్ ప్రొడక్షన్ నెం.1గా ప్రేక్షకుల ముందుకొచ్చే ఈ నూతన చిత్రం ‘రెటీనా’ అందరూ మెచ్చేలానే ఉంటుంది. ప్రతీ ఒక్కరికీ సంతృప్తిని కలిగించేలా ఈ సినిమాను తెరకెక్కిస్తాం. ‘రెటీనా’ అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యం. ప్రేక్షకులకు రియల్ అనుభూతి ఇవ్వాలని సినిమాని అందంగా రూపొందిస్తాం. టెక్నికల్ బ్రిలియన్స్ తో పాటు భావోద్వేగాలు, సహజమైన పరిస్థితులు అన్నీ ఈ సినిమాలో మిళితమై ఉంటాయి. ప్రేక్షకులకు గొప్ప అనుభూతి ఇవ్వాలనే లక్ష్యంతో సినిమాను రూపొందిస్తాం” అని అన్నారు. ‘కమిటీ కుర్రోళ్ళు’ఫేమ్ యశ్వంత్ పెండ్యాల మాట్లాడుతూ.. యువతరం అందరికీ నచ్చే కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రతీ యువకుడు తనని తానూ ఈ చిత్రంలో చూసుకుంటాడు . అన్ని వర్గాల వారు కనెక్టయ్యే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది అన్నారు. యోగికత్రి, సతీష్, పూజితా, విజయలక్ష్మి, కె.వి.ఎల్. నరసింహారావు(హై కోర్ట్ అడ్వకేట్ ) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్ : పి. కె. రవికుమార్, డైరక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ : రవి.కె.రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్: రాకేష్, ప్రొడక్షన్ డిజైనర్ : ఏ.వాసు, పి.ఆర్.ఓ : బాబు నాయక్.

Related posts