ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు తెలుగు ప్రేక్షకులకు అందించిన లేటెస్ట్ మూవీ ‘రాక్షసపురం’. కన్నడలో సంచలన విజయం సాధించిన ‘రాక్షసపుర’ చిత్రానికి ఇది తెలుగు అనువాదం. ఈ రోజు (మే 15న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు వచ్చిన ‘రాక్షసపురం’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. చిత్ర సమర్పకులు కె.ఎస్.రామారావు మాట్లాడుతూ – ‘రాక్షసపురం’ చిత్రాన్ని 147కి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేశాం. సినిమా చూసిన వాళ్లు చాలా బాగుందని అంటున్నారు. కలెక్షన్స్ కొన్ని చోట్ల బాగున్నాయి. కొన్ని చోట్ల ఇంకా పికప్ అవుతున్నాయి. సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నా స్నేహితుడు సతీష్ ఈ సినిమా చూడమని…
