‘రాకాస’ సినిమాకు థియేటర్లో అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఓటీటీలోనూ ఈ చిత్రం దూసుకుపోతోంది. నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్‌లో టాప్ 7కి ‘రాకాస’ చేరుకుంది. ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు 1.2 మిలియన్ వ్యూస్‌తో ఏడో స్థానంలో ట్రెండ్ అవుతూ ఉందని నెట్ ఫ్లిక్స్ సంస్థ ప్రకటించింది. ఈ ఘనతతో ఈ వారం నెట్ ఫ్లిక్స్‌పై ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన ఆంగ్లేతర చిత్రాల జాబితాలో ‘రాకాస’ పలు అంతర్జాతీయ మార్కెట్ల చిత్రాల సరసన నిలిచింది. థియేటర్లలో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ కంటే డిజిటల్ స్ట్రీమింగ్‌లో మరింత ఆదరణ లభిస్తోందని ఈ లెక్కలే చెబుతున్నాయి. థియేటర్లలో నెమ్మదిగా మౌత్ టాక్‌తో దూసుకుపోయిన ఈ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్లియర్ రెస్పాన్స్ పొందినట్టుగా దూసుకుపోతోంది. థియేటర్లలోనే ఈ మూవీని అందరూ ఫ్యామిలీతో…
