తెలుగు యూనివర్సిటీకి తెలంగాణ వైతాలీకుడు, సామాజిక పరిశోధకుడు సురవరం ప్రతాప్ రెడ్డి నామకరణం చేయడం తెలంగాణ సమాజానికి దక్కిన గౌరవమని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ అన్నారు. మంగళవారం నాడు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సురవరం ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులు మరియు సురవరం సాహితీ వైజయంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టడమంటే ఓ వ్యక్తిని ఆదరించడం కాదని, తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య రంగాలను, జర్నలిజం చరిత్రను విశ్వవ్యాప్తి చేయడమేనని విరాహత్ స్పష్టం చేశారు. గోల్కొండ పత్రికలో తన వార్తలతో ప్రజల్లో ఎనలేని చైతన్యం తెచ్చిన ఘనత ప్రతాప్ రెడ్డికే దక్కిందన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా దేశంలో తెలుగు భాషకు…