కరోన కారణంగా సకుటుంబ సమేతంగా “క్షీర సాగర మథనం” చిత్రాన్ని చూసేందుకు థియేటర్లకు రాలేకపోయినవాళ్ళంతా నేటి నుంచి (సెప్టెంబర్ 4) అమెజాన్ ప్రైమ్ లో “క్షీరసాగర మథనం” చిత్రాన్ని ఆస్వాదించవచ్చు అంటున్నారు చిత్ర దర్శకులు అనిల్ పంగులూరి. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన పలు సాఫ్ట్వేర్ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న ఓ ఇరవై మంది మిత్రుల ప్రోత్సాహంతో… అనిల్ పంగులూరి తెరకెక్కించిన “క్షీర సాగర మథనం” ఈరోజు నుంచి అమెజాన్ లో లభ్యం కానుంది. శేఖర్ కమ్ముల ‘హ్యాపీ డేస్’కి సీక్వెల్ లాంటి ఈ చిత్రం ఆగస్టు 6న థియేటర్స్ లో విడుదలై సాఫ్ట్వేర్ వాళ్లనే కాకుండా… సెన్సిబిలిటీస్ ఉన్న ప్రతి ఒక్కరినీ మెప్పించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రేక్షకులు అమెజాన్ ప్రైమ్ లో “క్షీర సాగర మథనం” చిత్రాన్ని చూసి చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడు. శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది!
Related posts
-
‘Vettayan’ Movie Review in Telugu : వేట్టయన్ మూవీ రివ్యూ : ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్!
Spread the love By ఎం.డి.అబ్దుల్/టాలీవుడ్ టైమ్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించిన తాజా సినిమా... -
Double iSmart Movie Review in Telugu : ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రివ్యూ .. కనిపించని పూరి మార్క్ !
Spread the love పూరీ జగన్నాథ్, హీరో రామ్ కాంబినేషన్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే మూవీ వచ్చింది. ఈ సినిమా ప్రారంభమైనప్పుడు... -
ఘనంగా జరిగిన “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా ఫస్ట్ సింగిల్ ‘గుమ్మా..’ సాంగ్ విడుదల కార్యక్రమం
Spread the love సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్...