* కిల్లర్ ఎవరో గెస్ చేస్తే ఒక్కొక్కరికి లక్ష రూపాయలు బహుమతి
‘వాడు సామాన్యుడు కాదు.. కేర్ ఫుల్…’అంటూ శుభలేఖ సుధాకర్ చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ‘ఎం4ఎం’ (మోటీవ్ ఫర్ మర్డర్) మూవీ ట్రైలర్ ఇండస్ట్రీలో ది న్యూ ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. థ్రిల్లింగ్ కథనం, సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో తెరకెక్కిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం’ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అమెరికన్ నటి జో శర్మా, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన పాన్ ఇండియా సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ట్రైలర్ చూస్తుంటే ఆద్యంతం పూర్తి సస్పెన్స్ తో సాగుతూ ప్రేక్షకులను సీట్లకు హతుక్కుపోయేలా చేసింది. కిల్లర్ విసిరే ఛాలెంజ్ ని ఛేదించడంలో పోలీసు అధికారులు చేసే సన్నివేశాలను డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల ఆసక్తికరంగా తెరకెక్కించారు. వరల్డ్‌వైడ్‌గా అందరికి కనెక్ట్ అయ్యే సబ్జెక్టుతో ఈ సినిమా రూపొందిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. 110 ఏళ్ల సినీ చరిత్రలో ఇంతవరకు ఎవరూ తీసుకోని కాన్సెప్టుతో ఈ సినిమా చేసినట్టు దర్శకుడు తెలిపారు. రాబోయే పదేళ్లు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటారనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ ‘ఎంఫోర్ఎం’ మూవీ హిందీ ట్రైలర్ ప్రతిష్టాత్మక గోవా ఫిలిం ఫెస్టివల్‌లో ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విడుదల చేయడంతో సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఎక్సలెంట్ టీంతో సినిమాను ఎంతో అద్భుతంగా పూర్తి చేశారు. హీరోయిన్ జో శర్మ తన ఫర్మార్మెన్స్‌తో సినిమాకు హైలైట్‌గా మారింది. హాలీవుడ్ రేంజ్‌లో సినిమా తెరకెక్కింది. కథ, కథనాలను నమ్ముకునే సినిమాను తీసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల ఆసక్తికరమైన కాంపిటీషన్ ప్రకటించారు. విడుదలైన ఫస్ట్ డే ఈ సినిమా చూసి ఇందులో కిల్లర్ ఎవరో గెస్ చేస్తే ఒక్కోక్కరికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. హీరోయిన్ జో శర్మకు ఈ సినిమాలో మంచి అవకాశం లభించింది. ఈ సినిమా కోసం అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఈ బ్యూటీ ఇందులో ఇన్విస్టిగేషన్ జర్నలిస్టుగా చేశారు. క్షణక్షణం ఉత్కంఠతో నడిచే ఈ సినిమా ట్రైలర్ చూస్తున్నంత సేపు ఊపిరి బిగబెట్టేలా ఉంటుంది. సినిమా ఎలా ఉండబోతోందో ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. తెలుగులో తెరకెక్కిన మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఎం4ఎంలో అమెరికన్ నటి జో శర్మా హీరోయిన్‌గా చేయడం విశేషంగా మారింది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇదివరకే ప్రదర్శించిన ఎం4ఎం సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణంలో నిర్మించారు. మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై, మెక్‌విన్ గ్రూప్ యూఎస్ఏ సహకారంతో ఎం4ఎం సినిమాను రూపొందించారు. భారతదేశంలో ఈ చిత్రాన్ని పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ సంస్థ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనుంది. పాన్ ఇండియా స్థాయిలో అమెరికాలో విడుదల బాధ్యతలను టెక్‌ఫ్లిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ , నార్త్ ఇండియా రిలీజ్ హక్కులను జేవీఈఎల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో “ఎం4ఎం” చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. థియేటర్లలో విడుదలకు ముందే ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. ప్రముఖ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా పాలయిస్ సీ థియేటర్ లో ప్రైవేట్ స్క్రీనింగ్ నిర్వహించగా, ముంబైలోని ఐఎమ్‌పీపీఏ ప్రీవ్యూ థియేటర్‌లో ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఇలా ప్రదర్శించిన ఎం4ఎం సినిమాకు సినీ వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. ఇక హీరోయిన్ జో శర్మా అమెరికా, భారత్‌లో విస్తృతంగా నిర్వహించిన ప్రమోషన్ టూర్ చిత్రానికి మరింత ప్రచారం తీసుకువచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉత్కంఠభరిత అనుభూతికి గురిచేసే తెలుగు మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా “ఎం4ఎం” ప్రత్యేక గుర్తింపు పొందుతుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అలాగే, తెలుగు సస్పెన్స్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అయిన ఎం4ఎం సినిమాలో అమెరికన్ నటి జో శర్మా హీరోయిన్‌గా చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. మూవీ విడుదలైన ఫస్ట్ డే సినిమా చూసి, ఇందులో కిల్లర్ ఎవరో గెస్ చేస్తే ఒక్కొక్కరికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు చిత్ర దర్శక నిర్మాత మోహన్ వడ్లపట్ల. ‘ఎంఫోర్ఎం’ మూవీ హిందీ ట్రైలర్‌ను ప్రతిష్టాత్మక గోవా ఫిలిం ఫెస్టివల్‌లో ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంచనాలు కూడా భారీగా పెరిగాయి. ఎక్సలెంట్ టీంతో ఎంతో అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు. హీరోయిన్ జో శర్మ తన ఫర్మార్మెన్స్‌తో సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. ”కథ, కథనాలను నమ్మి హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమాను తెరకెక్కించాం. ఈ సందర్భంగా అందరికీ ఓ ఛాలెంజ్ కూడా విసురుతున్నాను. ఈ సినిమా విడుదలైన ఫస్ట్ డే.. ఈ సినిమా చూసి ఇందులో కిల్లర్ ఎవరో గెస్ చేస్తే ఒక్కొక్కరికి రూ. లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తా”నని మోహన్ వడ్లపట్ల తెలిపారు.
–ఎం.డి అబ్దుల్
