నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘భగవంత్ కేసరి’ దసరా సీజన్లో హిట్ సినిమాగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో ఓ స్కూల్ వేదికపై బాలకృష్ణ చెప్పిన ‘గుడ్ టచ్ .. బ్యాడ్ టచ్’ సన్నివేశం ప్రేక్షకుల్ని, తల్లిబిడ్డల్ని విపరీతంగా ఆకట్టుకుంది. నెట్టింట కూడా ఈ టాపిక్ మీదే ఎక్కువ చర్చ జరుగుతోంది. ‘సినిమాలో గుడ్ టచ్.. బ్యాడ్ టచ్’ డైలాగు ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. ఆ సన్నివేశం గురించి చిత్రబృందంపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. తాజాగా దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ డైలాగ్‌పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. దానికి హాట్ బ్యూటీ అనసూయ కూడా రిప్లై ఇచ్చి దర్శకుడు అనిల్ రావిపూడిని ట్యాగ్ చేసింది. ‘భగవంత్ కేసరి’లో అద్భుతమైన డైలాగ్‌లతో ప్రజల్లో…