బాలయ్య సినిమా కాబట్టే..మనసులో మాట చెప్పా : హాట్ బ్యూటీ అనసూయ

Because of Balayya's movie..Speak your mind : Hot beauty Anasuya
Because of Balayya's movie..Speak your mind : Hot beauty Anasuya
Spread the love

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ‘భగవంత్‌ కేసరి’ దసరా సీజన్లో హిట్‌ సినిమాగా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో ఓ స్కూల్‌ వేదికపై బాలకృష్ణ చెప్పిన ‘గుడ్‌ టచ్‌ .. బ్యాడ్‌ టచ్‌’ సన్నివేశం ప్రేక్షకుల్ని, తల్లిబిడ్డల్ని విపరీతంగా ఆకట్టుకుంది. నెట్టింట కూడా ఈ టాపిక్‌ మీదే ఎక్కువ చర్చ జరుగుతోంది. ‘సినిమాలో గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌’ డైలాగు ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. ఆ సన్నివేశం గురించి చిత్రబృందంపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. తాజాగా దర్శకుడు, నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ ఈ డైలాగ్‌పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టారు. దానికి హాట్‌ బ్యూటీ అనసూయ కూడా రిప్లై ఇచ్చి దర్శకుడు అనిల్‌ రావిపూడిని ట్యాగ్‌ చేసింది. ‘భగవంత్‌ కేసరి’లో అద్భుతమైన డైలాగ్‌లతో ప్రజల్లో చైతన్యం కలిగించారు. ఇది బాలకృష్ణ చిత్రం కాబట్టి వారం రోజుల్లోనే ఆ సందేశం ప్రజల్లోకి వెళ్లింది. ఇతర మీడియాల ద్వారా అయితే 10 ఏళ్లు పట్టేది. మాస్‌ మసాలా సినిమాలోనూ ఇలాంటి గొప్ప సందేశాన్ని పెట్టినందుకు దర్శకుడు అనిల్‌ రావిపూడికి, చిత్రబృందానికి కృతజ్ఞతలు. అత్యంత ప్రభావవంతమైన పద్థతిలో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. శ్రీలీల, బాలయ్య పక్కపక్కనే ఉండి దుమ్ము లేపేశారు. ఆడ్డ బిడ్డల్ని సింహాల్లాగా తీర్చిదిద్దండి’’ అని రాహుల్‌ రవీంద్రన ట్వీట్‌లో పేర్కొన్నారు. రాహుల్‌ పోస్ట్‌కు అనసూయ స్పందిస్తూ ‘భగవంత్‌ కేసరి’ గురించి ఇంతకంటే గొప్పగా ఎవరూ చెప్పలేరు. నా మనసులో ఉన్న మాటలనే మీరు చెప్పారు. బాలకృష్ణ చెప్పిన చాలా డైలాగులు నేను ఇన్‌స్టా కోట్స్‌లో వాడాలనుకుంటున్నా. వాటిని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే ‘ఐ (డోంట్‌) కేర్‌’అంటూ అనిల్‌ రావిపూడిని ట్యాగ్‌ చేశారు. ప్రస్తుతం నెట్టింట వీరిద్దరి సంభాషణ వైరల్‌ అవుతోంది!