పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన రామ్ పోతినేని – మహేష్ బాబు పి – మైత్రీ మూవీ మేకర్స్ సినిమా

Ram Pothineni, P Mahesh Babu, Mythri Movie Makers' RAPO22 Launched With Pooja Ceremony
Spread the love

ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ రోజు ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. హీరోగా రామ్ 22వ చిత్రమిది. #RAPO22లో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. 
హీరో రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు గోపీచంద్ మలినేని కెమెరా స్విచ్ఛాన్ చేయగా, దర్శకుడు హను రాఘవపూడి క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి దర్శకుడు వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర దర్శకుడు మహేష్ బాబుకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలితో పాటు ఆ సంస్థ సీఈవో చెర్రీ, దర్శకులు గోపీచంద్ మలినేని, హను రాఘవపూడి, వెంకీ కుడుముల, శివ నిర్వాణ, పవన్ సాధినేని స్క్రిప్ట్ అందజేశారు.
ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్‌గా #RAPO22 రూపొందుతోంది. ఈ సినిమా కోసం రామ్ స్పెషల్‌గా మేకోవర్ అవుతున్నారు. ‘మిస్ శెట్టి మిస్టర్  పోలిశెట్టి’ విజయం తర్వాత దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్న చిత్రమిది. యువతను ఆకట్టుకునే అంశాలతో పాటు చక్కటి కథ, కథనంతో సినిమా రూపొందుతోందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని వివరించారు.
ఈ ప్రారంభోత్సవ వేడుకలో దర్శకులు గోపీచంద్ మలినేని, హను రాఘవపూడి, వెంకీ కుడుముల, శివ నిర్వాణ, పవన్ సాధినేనితో పాటు చిత్ర బృందం పాల్గొంది.
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించనున్న ఈ సినిమాకు నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, కథ, కథనం, దర్శకత్వం: మహేష్ బాబు పి.

Related posts

Leave a Comment