నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం లక్ష్య. డిసెంబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. సినిమా విడుదల సందర్భంగా హీరో నాగశౌర్య మీడియాతో మాట్లాడారు ఆ విశేషాలు… వరుడు కావలెను సినిమా నా పరిధికి సంబంధించినది. అలాంటి సబ్జెక్ట్ ఎన్ని సార్లు చేసినా సక్సెస్ అవుతుందన్న నమ్మకం దర్శక నిర్మాతలకు ఉంది. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఇప్పుడు లక్ష్య సినిమా రాబోతోంది. లక్ష్య ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. కథ విన్న వెంటనే నా వైపు నుంచి వంద శాతమివ్వాలని…
Category: FILM NEWS
RRR ట్రైలర్ సృష్టిస్తున్న వైరల్ ఫీవర్
రామ్ చరణ్ : భీకర వ్యక్తిత్వమ్.. అద్భుత యాక్షన్ RRR ట్రైలర్‌లో రామ్ చరణ్ విభిన్న పాత్రలో తన భీకర వ్యక్తిత్వాన్నీ, అద్భుత యాక్షన్ సన్నివేశాలనూ చూసి ప్రేక్షకులు విస్మయం చెందుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో ఏదైనా ఫీవర్ వుంటే అది నేడు RRR ట్రైలర్ సృష్టిస్తున్న వైరల్ ఫీవరే. ఇటీవలి కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా పబ్లిసిటీ, ప్రమోషన్, పోస్టర్లు, టీజర్‌లు ఒక ఎత్తైతే, ట్రైలర్ అంతకి మించి అనూహ్యమైన ప్రమాణాలను నెలకొల్పుతోంది. ఇదేమీ లేకపోతే వూరికే ఈ మూవీని మాగ్నమ్ ఓపస్ అని పిలవరు కదా. RRR ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ని 70ఎమ్ఎమ్ స్క్రీన్‌పై అల్లూరి సీతా రామరాజుగా చూడాలనే ఉత్సాహాన్ని ఇక ఆపుకోలేక పోతున్నారు ఫ్యాన్స్. వెంట్రుకలు నిక్కబొడుచుకునే యాక్షన్ ఎమోషన్ల రెండంచుల…
సోనీ అగర్వాల్ ‘డిటెక్టివ్ సత్యభామ’ ట్రైలర్ విడుదల
‘7జి బృందావన్ కాలనీ’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సోనీ అగర్వాల్ ఇప్పటికీ ప్రేక్షకులకు హాట్ ఫేవరెట్‌గానే ఉంది. తాజాగా ఆమె డిటెక్టివ్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘డిటెక్టివ్ సత్యభామ’. సిన్మా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నవనీత్ చారి దర్శకత్వంలో శ్రీశైలం పోలెమోని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్, పోస్టర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఫిలించాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణగౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … ట్రైలర్ చూస్తుంటే ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాల ఘటనలను బేస్‌గా తీసుకుని ఈ సినిమా చేసినట్లు ఉంది. వాస్తవాలతో కూడిన కథలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. సోనీ అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్‌ని ప్రధాన పాత్రకు…
ఘనంగా కాదంబరి కిరణ్ కుమార్తె సత్య శ్రీకృతి వివాహ వేడుక
ప్రముఖ నటులు, ‘మనం సైతం’ వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ కుమార్తె సత్య శ్రీకృతి, ఈశ్వర్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్ శంషాబాద్ లోని అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవానికి సినీ, రాజకీయ ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్సీలు ప్రకాష్ గౌడ్, రామచంద్రరావు, కర్నె ప్రభాకర్, మా అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు, నటులు నరేష్, బ్రహ్మాజీ, శివాజీ, కృష్ణుడు, సాయి కుమార్, గీత రచయిత చంద్రబోస్, సుచిత్ర దంపతులు, దర్శకుడు దశరథ్, వీఎన్ ఆదిత్య, సముద్ర, చంద్ర మహేష్ తదితరులు హాజరయ్యారు. వధూవరులు సత్య శ్రీకృతి , ఈశ్వర్ లను ఆశీర్వదించారు.
‘గమనం’ కథ నన్ను కదిలించింది : శ్రియా సరన్
‘గమనం’ సినిమాతో సంజనా రావు దర్శకురాలిగా పరిచయం కాబోతోన్నారు. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘గమనం’ సినిమాను డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రియా సరన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు… ●ఇరవై ఏళ్లు ఇలా మీ ముందు ఉన్నాను. మొదట ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలా నేను మీ పక్కింటి అమ్మాయిలా మారిపోయాను. మా అమ్మ మ్యాథ్స్ టీచర్. మా నాన్న బీహెచ్‌ఈఎల్‌లో పని చేసేవారు. ఇష్టం నా మొదటి సినిమా. ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. నాటి నుంచి నేటి వరకు నాకు ఎంతో…
NTR & Ram Charan from RRR
NTR & Ram Charan from RRR
NTR & Ram Charan from RRR
NTR & Ram Charan from RRR
‘శ్యామ్ సింగ రాయ్’ కోసం సిరివెన్నెల చివరి పాట డిసెంబర్ 7న విడుదల
న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి.డిసెంబర్ 7న సిరివెన్నెల రాసిన పాటను చిత్రయూనిట్ విడుదల చేయబోతోంది. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో నాని, సాయి పల్లవి ఆకట్టుకున్నారు. నాని తన మీసాన్ని తిప్పుతూ ఉంటే.. సాయి పల్లవి మాత్రం సిగ్గుపడుతున్నట్టుగా కనిపిస్తున్నారు. శ్యామ్ సింగ రాయ్ సినిమాకు నాని, సాయి పల్లవి మధ్య వచ్చే ప్రేమ కథ అతి పెద్ద బలంగా మారుతుందనిపిస్తోంది.‘సిరివెన్నెల’ పాటకు మిక్కీ జే మేయర్ క్లాస్ ట్యూన్ ఇచ్చారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. సాంగ్…
శ్రీలక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 ప్రారంభం
ధర్మ, పవి హీరో హీరోయిన్లుగా శ్రీలక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా నూతన చిత్రం రూపొందుతోంది. డిస్ట్రిబ్యూషన్ రంగంలో అనుభవం ఉన్న నిర్మాత ప్రవీణ్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఆలోచింపజేసే కథగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ చిత్రాలకు సినిమాటొగ్రాఫర్‌గా పనిచేసిన శ్యామ్ తుమ్మలపల్లి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఈ రోజు హైదరాబాద్‌లో జరిగాయి. మొదటి సన్నివేశానికి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల క్లాప్ కొట్టగా మాగంటి గోపీనాథ్ కెమెరా స్విచాన్ చేశారు. హీరో శ్రీ విష్ణు, దర్శకుడు వీఎన్ ఆదిత్య స్క్రిప్టును మేకర్స్‌కు అందజేశారు. ఈ కార్యక్రమానికి నిర్మాత వివేక్ కూచిబొట్ల హాజరయ్యారు. డిసెంబరు చివరి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. తారాగణం: ధర్మ, పవి సాంకేతిక వర్గం:దర్శకత్వం:…
మెగాస్టార్ చిరంజీవి జోరు : 4 ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీ!
మెగాస్టార్ చిరంజీవి యమజోష్ మీదున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ ఎంతో ఉషారుగా అడుగులు ముందుకేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్నవి నాలుగు ప్రాజెక్టులు. వీటితో ఆయన ఎంతో బిజీగా ఉన్నారు. ‘ఆచార్య’ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్న చిరంజీవి.. మరోపక్క మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లూసిఫెర్’ రీమేక్ ‘గడ్ ఫాదర్’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘ఆచార్య’ ఫిబ్రవరి 4న విడుదల కావడానికి సిద్ధమవుతోంది. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ‘భోళా శంకర్’ షూటింగ్ కూడా ప్రారంభించేసి యువతరం హీరోలకి పెద్ద షాక్ ఇచ్చారు. షాకేకాదు, సవాల్ ని సైతం విసిరారు. మరో పక్క బాబీ దర్శకత్వంలో ‘చిరు 154’ షూటింగ్ వేగాన్ని పెంచారు. ఈ నెలలోనే అటు ఆచార్య, ఇటు భోళాశంకర్ మరో పక్క ‘చిరు 154’ షూటింగ్స్ లో…
