మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాల్లా పెద్ది కూడా దశాబ్దానికి ఒకసారి వచ్చే సినిమా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ప్రతి ప్రోమో దేశవ్యాప్తంగా బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు బుచ్చి బాబు సానా ఈ రూరల్ యాక్షన్-స్పోర్ట్స్ కథను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆకట్టుకునే ఫస్ట్-లుక్ పోస్టర్లు, పాత్రల గ్లింప్స్‌లు, పాటలు ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రాన్ని, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ముంబైలో జరిగిన ఈవెంట్ లో లాంచ్ చేశారు. రెగ్యులర్ హీరో ఇంట్రడక్షన్ ట్రైలర్‌లా కాకుండా.. ‘పెద్ది’ ట్రైలర్ ఒక పల్లె ప్రపంచాన్ని, అక్కడి జీవితాల్ని, పోరాటాన్ని, ఆటపై ఇష్టాన్ని ఎంతో సహజంగా పరిచయం చేసింది. పెద్ది అనే పాత్ర ఒక మల్టీ టాలెంటెడ్ అథ్లెట్. క్రికెట్, కుస్తీ, రన్నింగ్… ఏ ఆట అయినా తన శక్తితో నెగ్గే ఆటగాడు. అక్కడి యువతకు హీరోలా కనిపించే పెద్ది.. గ్రామస్తుల గౌరవాన్ని కూడా సంపాదించుకుంటాడు. అయితే అతని ఎదుగుదల ఒక ఆధిపత్య వర్గానికి నచ్చదు. అక్కడి నుంచి కథ అసలైన సంఘర్షణలోకి వెళ్తుంది. బుచ్చిబాబు సానా పెద్ది లార్జర్ దెన్ లైఫ్ ప్రపంచాన్ని తీర్చిదిద్దన తీరు ట్రైలర్‌లో అదిరిపోయింది. ప్రతి ఫ్రేమ్‌కి ఒక ఎమోషన్ ఉంది. ట్రైలర్ మొత్తం హార్ట్‌బీట్‌లా అనిపిస్తుంది.. నిశ్శబ్ద క్షణాల్లో సున్నితంగా, యాక్షన్ సన్నివేశాల్లో ఉరుములా బ్లాస్ట్ లా పేలింది. ఇది కేవలం స్పోర్ట్స్ డ్రామా కాదు.. ఆట, బతుకు, పోరాటం అన్నీ కలిసిన ప్రపంచం. ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో కేర్‌తో డిజైన్ చేయడంతో ప్రేక్షకులని ఎమోషన్‌తో నిండిన ప్రపంచంలోకి వెళ్లిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. రైల్వే ప్లాట్‌ఫామ్‌లపై జరిగే భారీ ఘర్షణలు, గాల్లో ఎగిరే స్టంట్స్, మట్టిలో జరిగే కుస్తీ పోరాటాలు.. ప్రతి యాక్షన్ బ్లాక్ కొత్తగా కనిపిస్తోంది. ముఖ్యంగా క్రికెట్, కుస్తీని కలిపి డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది. రామ్ చరణ్ ఈ సినిమాలో పూర్తిగా కొత్త అవతార్‌లో అదరగొట్టారు. ఆయన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, బాడీ లాంగ్వేజ్, అథ్లెటిక్ ప్రెజెన్స్ అన్నీ కూడా పాత్రకు అద్భుతంగా సరిపోయాయి. ఒకవైపు ఫ్లడ్‌లైట్స్ కింద రఫ్ బ్యాట్‌తో క్రికెట్ ఆడే పెద్ది.. మరోవైపు మట్టిలో కుస్తీ పోరాటాల్లో దిగే పెద్ది.. ఈ రెండు షేడ్స్‌లో చరణ్ అద్భుతంగా కనిపించారు. ఇది కేవలం లుక్ మార్పు కాదు.. పూర్తిగా పాత్రలో లీనమై చేసిన పెర్ఫార్మెన్స్ అని ట్రైలర్ స్పష్టం చేసింది. జాన్వీ కపూర్ తన పాత్రలో ఎంతో నేచురల్‌గా కనిపించింది. గ్రామీణ యువతిగా ఆమె చూపించిన ఎక్స్‌ప్రెషన్స్ ట్రైలర్‌కు మంచి వార్మ్‌నెస్ తీసుకొచ్చాయి. అలాగే శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ పాత్రలు కూడా కథలో బలమైన ప్రాధాన్యం కలిగి ఉన్నాయని ట్రైలర్ సూచించింది. టెక్నికల్‌గా ‘పెద్ది’ మరో స్థాయిలో కనిపిస్తోంది. అవినాష్ కొల్లా రూపొందించిన పెద్ది ప్రపంచం అద్భుతంగా వుంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ ట్రైలర్‌కు పెద్ద అసెట్‌గా నిలిచింది. ప్రతి ఫ్రేమ్‌లో రిచ్ విజువల్స్, డైనమిక్ కెమెరా మూమెంట్స్ కట్టిపడేశాయి. ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు ఆత్మలా నిలిచింది. ఎమోషన్స్‌ను, యాక్షన్‌ను ఒకేసారి ఎలివేట్ చేస్తూ ఆయన ఇచ్చిన స్కోర్ ట్రైలర్‌ను మరింత పవర్‌ఫుల్‌గా మార్చింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో నిర్మించిన ఈ సినిమా ప్రతి ఫ్రేమ్ కూడా బిగ్ స్క్రీన్ అనుభూతిని కలిగిస్తోంది. ప్రేక్షకులను పూర్తిగా లీనం చేసే ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. విడుదలకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉండగా.. ట్రైలర్ తో ‘పెద్ది’పై అంచనాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి.
ముంబైలో గ్రాండ్ గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ… గుడ్ ఈవెనింగ్ ముంబై. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా కోసం గత రెండేళ్లుగా ప్రాణం పెట్టి పని చేశాం. బుచ్చిబాబు అయితే గత ఐదేళ్లుగా ఈ సినిమాతోనే ట్రావెల్ అవుతున్నారు. బుచ్చిబాబుకి ఒక విషయంలో ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. రెహమాన్ గారిని ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకొచ్చేలా కన్విన్స్ చేశారు (నవ్వుతూ). ప్రతి ప్రాజెక్ట్‌కు నాలుగు పిల్లర్లు ఉంటాయి. కానీ మా ప్రాజెక్ట్‌కు సెంటర్ పిల్లర్ రెహమాన్ గారు. రెహమాన్ గారి మ్యూజిక్ అంటే నాకు ఎంతో అభిమానం. ఆయన ‘పెద్ది’లో భాగం కావడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. దివ్యేందు ఒక గ్యాంగ్‌స్టర్. తనకంటూ ఓ స్టైల్ స్వాగ్ కనిపిస్తాడు. రత్నవేలు గారితో ఇది నాకు ఐదో చిత్రం. ఆయన మాస్టర్. ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో అందంగా తీర్చిదిద్దారు. జాన్వి చాలా హార్డ్‌వర్కింగ్ పర్సన్. తనలో చాలా డెడికేషన్ ఉంది. తన పాత్రను ఎంతో నిజాయితీగా చేసింది. మా నాన్నగారు, శ్రీదేవి మేడం కలిసి సినిమాలు చేశారు. జాన్వి, నేను కలిసి నటించాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఇది మాకు ఒక నోస్టాల్జిక్ మూమెంట్. బుచ్చిబాబు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇక్కడికి వచ్చిన తెలుగు అభిమానులందరికీ పేరుపేరునా నమస్కారం. ఈ క్యారెక్టర్ చేయడం ఫిజికల్‌గా చాలా చాలెంజింగ్. సల్మాన్ ఖాన్ గారు, ఆమిర్ ఖాన్ గారు ‘సుల్తాన్’, ‘దంగల్’ లాంటి చిత్రాలతో మాకు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. బుచ్చిబాబు కథ చెప్పినప్పుడే ఈ పాత్ర కోసం ట్రాన్స్‌ఫర్మ్ అవ్వాలని తెలుసు. ఇది చాలా నిజాయితీగా చేసిన సినిమా. అందరికీ ఒక ఐడెంటిటీ కావాలి. అలాంటి ఐడెంటిటీ కోసం చేసే ప్రయాణం. ఈ కథని దర్శకుడు చాలా ఆర్గానిక్‌గా, అలాగే హైలీ కమర్షియల్‌గా చూపించారు. ప్రేక్షకులందరూ చాలా సర్‌ప్రైజ్ అవుతారు. నా కెరీర్‌లో చేసిన మోస్ట్ ఇన్‌స్పైరింగ్ ఫిల్మ్ ఇది. ఇలాంటి సినిమాలు దశాబ్దంలో ఒకసారి మాత్రమే వస్తాయి. ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు తరచుగా రావు. అవి రావాలంటే సంవత్సరాలు పడుతుంది. పెద్ది కూడా లాంటి అరుదైన సినిమా . ‘ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు. ఇలాంటి సినిమా చేస్తున్నపుడు ప్రతిక్షణం ఆస్వాదించాలి’ అని నాన్నగారు చెప్పేవారు. మంచి సినిమాలు అంత ఈజీగా రావు. ‘మగధీర’ చెప్సిన ఏళ్ల తర్వాత ‘రంగస్థలం’ వచ్చింది. తర్వాత ఆర్ఆర్ఆర్ వచ్చింది. లక్కీగా పెద్ది త్వరగానే వస్తుంది. ఇది నా లైబ్రరీలో ఎప్పటికీ దాచుకునే సినిమా.
హీరోయిన్ జాన్వి కపూర్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం మేము గత రెండేళ్లుగా పని చేస్తున్నాం. మీ అందరితో కలిసి ట్రైలర్ చూడడం చాలా ఆనందంగా ఉంది. ఇది మాకు చాలా స్పెషల్ మూమెంట్. బుచ్చిబాబు గారు చాలా రౌడీ డైరెక్టర్ (నవ్వుతూ). తనకు కావాల్సిన ఔట్‌పుట్ వచ్చే వరకు వదిలిపెట్టరు. రెహమాన్ గారు మ్యూజిక్ చేసే సినిమాలో నటించడం ఒక గౌరవం. రామ్ చరణ్ గారితో కలిసి పని చేయడం నా జీవితంలో గొప్ప గౌరవం. అమ్మగారు, చిరంజీవి గారు నటించిన సినిమాలకు ప్రేక్షకులు ఎంతో ప్రేమ చూపించారు. మా కాంబినేషన్ కూడా ప్రేక్షకులకు ఎదురుచూశారు. ‘పెద్ది’ నాకు చాలా స్పెషల్ ఫిలిం. రామ్ చరణ్ గారు ద బెస్ట్ పర్సన్. ఈ సినిమాను మీరందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.
ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. “నేను తమిళ్ సినిమాలు చేస్తూ, అవి తెలుగులో డబ్ అవుతూ వచ్చాయి. అయితే నేరుగా తెలుగు సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ‘పెద్ది’ రూపంలో ఆ అవకాశం వచ్చింది. బుచ్చిబాబు గారు ఈ కథ చెప్పినప్పుడు ఆయన కళ్లలో ఉన్న ప్యాషన్ చూశాను. అప్పుడే ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా కావాలని అనిపించింది. బుచ్చిబాబు గారికి, రామ్ చరణ్ గారికి, సతీష్ గారికి థ్యాంక్యూ. బుచ్చిబాబు ప్రతి ఫ్రేమ్‌ను చాలా డీటైల్‌గా తీర్చిదిద్దారు. రామ్ చరణ్ గారి హార్డ్‌వర్క్‌ను నేను ఫిజికల్‌గా, మెంటల్‌గా చూశాను. బుచ్చిబాబు సాఫ్ట్‌గా కనిపిస్తారు కానీ తనకు కావాల్సిన ఔట్‌పుట్ వచ్చే వరకు ఎక్కడా రాజీపడరు. ఇది చాలా స్పెషల్ ఫిలిం.
నిర్మాత సతీష్ కిలారు మాట్లాడుతూ.. “ఈవెంట్‌కు వచ్చిన అందరికీ థ్యాంక్యూ. ముంబై నుంచి ప్రమోషన్స్ కిక్‌స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక అద్భుతమైన సినిమా. గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం చాలా హార్డ్‌వర్క్ చేశాం. జూన్ 4 నుంచి ఇది మీ సినిమా అవుతుంది. ఈ సినిమా కోసం బుచ్చిబాబు గారు చాలా కష్టపడ్డారు. రామ్ చరణ్ గారి నుంచి ఎలాంటి పెర్ఫార్మెన్స్ కావాలో అంత అద్భుతంగా రాబట్టుకున్నారు. రామ్ చరణ్ గారు ఈ సినిమా కోసం చేసిన హార్డ్‌వర్క్ మాటల్లో చెప్పలేం. చాలా గాయాలు అయ్యాయి. అయినా వాటిని లెక్క చేయకుండా పని చేశారు. రత్నవేలు గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. రెహమాన్ గారు అద్భుతమైన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. మనసుపెట్టి ఈ సినిమాకు పని చేశారు. జాన్వి కపూర్ గారు సెట్‌లో ఉన్నప్పుడు శ్రీదేవి గారు గుర్తొచ్చేవారు. ఎంతో క్రమశిక్షణతో పని చేశారు. ‘రంగస్థలం’ సమయంలో రామ్ చరణ్ గారు ‘మీతో ఒక సినిమా చేస్తాను’ అన్నారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది. మా సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
దివ్యేందు శర్మ మాట్లాడుతూ.. మీ అందరి రియాక్షన్ చూసిన తర్వాత చాలా మజా వచ్చింది. ‘పెద్ది’ లాంటి పెద్ద సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. బుచ్చిబాబు గారికి థ్యాంక్యూ. ఆయన ఎంతో చక్కగా నన్ను చూసుకున్నారు. రత్నవేలు గారు ప్రతి ఫ్రేమ్‌ను అద్భుతంగా క్యాప్చర్ చేశారు. రామ్ చరణ్ గారు ‘పెద్ది’ లుక్‌లో అదరగొట్టారు. రెహమాన్ గారు మ్యూజిక్ చేసిన సినిమాలో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నాను.
దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. నా రెండో సినిమాకే ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన రామ్ చరణ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఆయనకు చాలా గాయాలు అయ్యాయి. కానీ అవన్నీ లెక్క చేయలేదు. జాన్వి గారు చాలా హార్డ్‌వర్కింగ్. తప్పకుండా వారి అమ్మగారి స్థాయికి వెళ్తారని కోరుకుంటున్నాను. రెహమాన్ గారితో పని చేయడం నా డ్రీమ్. నిన్ననే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విన్నాను. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. ఇంకా సెకండ్ హాఫ్ వినాలి. దివ్యేందు మా టీమ్‌లో కలిసిపోయి చాలా దగ్గరయ్యారు. రత్నవేలు గారు నా సినిమాకు లైఫ్ ఇచ్చారు. మా నిర్మాత సతీష్ గారికి హ్యాపీ బర్త్‌డే. థ్యాంక్యూ ఇండియా, థ్యాంక్యూ ముంబై.
డీఓపీ రత్నవేలు మాట్లాడుతూ.. పెద్ది అద్భుతమైన కథ. ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పని చేశాం. రామ్ చరణ్ గారి మైండ్‌బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆయన ఈ సినిమా కోసం పూర్తిగా ట్రాన్స్‌ఫర్మ్ అయ్యారు. దివ్యేందు కూడా చాలా చక్కగా నటించారు. జాన్వి కపూర్ గారికి ఈ సినిమాతో సౌత్‌లో మరింత మంది అభిమానులు వస్తారు. రెహమాన్ గారితో నేను చేస్తున్న మూడో సినిమా ఇది. ఇప్పటికీ ఆయనను చూస్తే ఒక ఫ్యాన్ మూమెంట్‌లానే ఉంటుంది. ఆయన అద్భుతమైన వర్క్ ఇచ్చారు. సతీష్ గారు చాలా పేషెంట్ ప్రొడ్యూసర్. ఆయనతో కలిసి పని చేయడం ఎంతో ఆనందం ఇచ్చింది. లవ్ యూ చెర్రీ… లవ్ యూ ఎవ్రిబాడీ.
తారాగణం: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సానా
సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
బ్యానర్: వృద్ధి సినిమాస్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా
సంగీతం: ఏఆర్ రెహమాన్
DOP: ఆర్ రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
PRO: వంశీ-శేఖర్

