మెగాస్టార్ చిరంజీవి జోరు : 4 ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీ!

Megastar chiranjivi news
Megastar chiranjivi news
Spread the love

మెగాస్టార్ చిరంజీవి యమజోష్ మీదున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ ఎంతో ఉషారుగా అడుగులు ముందుకేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్నవి నాలుగు ప్రాజెక్టులు. వీటితో ఆయన ఎంతో బిజీగా ఉన్నారు. ‘ఆచార్య’ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్న చిరంజీవి.. మరోపక్క మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లూసిఫెర్’ రీమేక్ ‘గడ్ ఫాదర్’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘ఆచార్య’ ఫిబ్రవరి 4న విడుదల కావడానికి సిద్ధమవుతోంది. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ‘భోళా శంకర్’ షూటింగ్ కూడా ప్రారంభించేసి యువతరం హీరోలకి పెద్ద షాక్ ఇచ్చారు. షాకేకాదు, సవాల్ ని సైతం విసిరారు. మరో పక్క బాబీ దర్శకత్వంలో ‘చిరు 154’ షూటింగ్ వేగాన్ని పెంచారు. ఈ నెలలోనే అటు ఆచార్య, ఇటు భోళాశంకర్ మరో పక్క ‘చిరు 154’ షూటింగ్స్ లో పాల్గొంటూ మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో రికార్డు సృష్టిస్తున్నారు. ఈ వయస్సులోనూ చిరంజీవి యంగ్ స్టార్స్ లా దూసుకెళుతున్నారు. గతంలో అంటే 1980 కాలంలో మెగాస్టార్ చిరంజీవి ఇలానే యమస్పీడుతో నాలుగు చిత్రాలను ఒకేసారి సెట్స్ మీదుంచి ఆయా సినిమాల షూటింగ్స్ లో పాల్గొనేవారు. తనలో అప్పటికీ.. ఇప్పటికీ ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని చిరంజీవి మరోసారి నిరూపించుకుంటూ ఆ కాలాన్ని రిపీట్ చేస్తున్నారు.