అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్, క్లోరో ఫిల్మ్ బ్యానర్ల మీద బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో విహాన్ తెరకెక్కించిన చిత్రం ‘హ్యాంగ్‌మెన్’. వి. శ్రీకాంత్, అజయ్ మైసూర్, వి. హెచ్. రావు నిర్మించిన ఈ మూవీకి కమ్రాన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకి ఉదయ్ గుర్రాల కెమెరామెన్‌గా, ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేశారు. ఈ మూవీ జూలై 3 నుంచి సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈక్రమంలో మంగళవారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి పద్మశ్రీ డా. బ్రహ్మానందం, నందినీ రెడ్డి, అద్దంకి దయాకర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. బ్రహ్మానందం మాట్లాడుతూ .. ‘‘హ్యాంగ్‌మెన్’ అనే టైటిల్ చూసి ఈ ఈవెంట్‌కు రావాలని నిర్ణయించుకున్నాను. దీన్ని ఎలాంటి ఉద్యోగం అనాలో కూడా నాకు తెలీడం లేదు. ఉరి తీసే వ్యక్తి…
Day: June 30, 2026
తమ్మారెడ్డి భరద్వాజకు ఫిలింక్రిటిక్స్ శుభాకాంక్షలు
తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కులాంటి వారు, చిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించే నాయకత్వ లక్షణాలున్న తమ్మారెడ్డి భరద్వాజ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. అధ్యక్షడు బత్తుల జె.వి. ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి, సీనియర్ జర్నలిస్టు ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మామిడి పల్లి గిరిధర్ లు ఆయన నివాస స్థలానికి వెళ్ళి శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్బంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. ఫిలిక్రిటిక్స్ కొత్త నాయకత్వం బాగా పని చేస్తున్నారని ..త్వరలో మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి తాను రావడానికి సుముఖంగా ఉన్నానని ఆయన అన్నారు.
