విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ‘కళ్యాణం కమనీయం జీవితం’ పోస్టర్

The 'Kalyanam Kamaneeyam Jeevitham' poster, unveiled by renowned writer Vijayendra Prasad
The 'Kalyanam Kamaneeyam Jeevitham' poster, unveiled by renowned writer Vijayendra Prasad
Spread the love

వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరోయిన్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కళ్యాణం కమనీయం జీవితం. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. టైటిల్ చాలా బాగుంది. రాజవంశీ టైటిల్ గురించి చెప్పగానే చాలా ఇంప్రెస్ అయ్యాను. ప్రొడ్యూసర్స్ మంచి ప్రయత్నం చేశారు .డైరెక్టర్ విజన్ పోస్టర్ ద్వారా తెలుస్తుంది. హీరో హీరోయిన్ లకు సినిమా టీమ్ కు అల్ ది బెస్ట్ అని అన్నారు
నిర్మాత పైలా ప్రసాద్ రావు మాట్లాడుతూ.. విజయేంద్ర ప్రసాద్ గారు అడగగానే మా పోస్టర్ లాంచ్ చేయడం ఆనందంగా వుంది ఆయనకు నా కృతజ్ఞతలు. డైరెక్టర్ కథ చెప్పగానే తప్పకుండా ఈ సినిమా చేయాలి అనిపించింది. దర్శకుడు చెప్పిన విధంగా సినిమా తీశాడు సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది అని అన్నారు
మరో నిర్మాత కిషోర్ గుండాల మాట్లాడుతూ… పాన్ వరల్డ్ స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ గారు పోస్టర్ ను ఆవిష్కరించి టీమ్ కు బ్లెస్సింగ్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది మంచి కథ, కథనాలతో సినిమాని తెరకెక్కించాము త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము అన్నారు
దర్శకుడు రవి లోకిరెడ్డి మాట్లాడుతూ… విజయేంద్ర ప్రసాద్ గారు మా పోస్టర్ ని ఆవిష్కరించడంతో నే మా సినిమా సక్సెస్ అయినంత ఆనందంగా వుంది. నిర్మాతలు నా కథను నమ్మి నాకు అవకాశం ఇచ్చారు వారి కృతజ్ఞతలు. ప్రేమ సస్పెన్స్ కలయికతో ఒక ఉత్కంఠ భరితంగా సినిమా వుంటుంది.అలాగే మా టీమ్ అంతా కలిసి ఒక మంచి ప్రయత్నం చేసాము ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను అన్నారు
నటీనటులు : ఖాన్ దురాని, సాహితీ అవంచ , ఉదయ్ పులిమి, విషిక, సత్యానంద్ లంక, కాకినాడ నాని, ధనలక్ష్మి బల్ల తదితరులు
బ్యానర్: వి వి ఫై మీడియా ఫిలిం ఫ్యాక్టరీ
రచయిత :ఎన్ సి అరవింద్ ఏకలవ్య
సంగీతం :శ్రీ మురళీ కార్తికేయ
డి ఓ పి. వెంకటరాజు డి
కో డైరెక్టర్: సతీష్ సిగిరెడ్డి
నిర్మాతలు: పైలా ప్రసాద రావు, కిషోర్ గుండాల
దర్శకుడు :రవి లోకి రెడ్డి
పి ఆర్ ఓ: సతీష్ కె