సీనియర్ నిర్మాత వడ్డే రమేష్ తనయుడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టారు హీరో వడ్డే నవీన్. ఆపై చక్కని అభిరుచితో విలక్షణమైన కథలను ఎంపిక చేసుకున్నారు వడ్డే నవీన్. కోరుకున్న ప్రియుడు, స్నేహితులు, చాలా బాగుంది, మనసిచ్చి చూడు, పెళ్లి..వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నారు వడ్డే నవీన్. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఎటాక్ సినిమా తర్వాత ఆయన మరే సినిమా చేయలేదు. తాను కోరుకున్న విలక్షణమైన కథలు క్యారెక్టర్లు తన దగ్గరికి రాకపోవడంతో వడ్డే నవీన్ సినిమాలకి కొంత విరామం ఇచ్చారు. దాదాపు దశాబ్దం తర్వాత తనే నిర్మాతగా, తనే హీరోగా ఒక సరికొత్త.. విలక్షణమైన కథాంశంతో కూడిన సినిమా ద్వారా త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు వడ్డే నవీన్. ఈ నేపథ్యంలో మే 11న వడ్డే నవీన్ జన్మదిన సందర్భాన్ని…
Day: May 11, 2026
ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం
హైదరాబాద్ ఫిలింనగర్ లో “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ను జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐఆర్ఎస్ అధికారి ఎస్ కే గుప్త, చిత్ర నిర్మాత రమేష్ పుప్పాల, బీఆర్ఎస్ పార్టీ నేత మొహమ్మద్ జుబెద్ బాషా, నటి ప్రవీణ, బిల్డర్ సాకేత్ అగర్వాల్, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ఓనర్ నందిని మాట్లాడుతూ – ఫిలింనగర్ అంటే గ్లామర్ ఫీల్డ్ కు చిరునామా. ఇక్కడ మా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఈ రోజు మా సెలూన్ ప్రారంభోత్సవానికి వ్చిన అతిథులు అందరికీ థ్యాంక్స్. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తాము అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని అనుకుంటున్నారు. మేము ఈ బ్యూటీషియన్ ఫీల్డ్ లో…
