ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’లో హీరోయిన్ గా త్రిప్తి డిమ్రీ

Tripti Dimri Comes On Board As The Female Lead In Prabhas, Sandeep Reddy Vanga, Bhadrakali Pictures Productions and T-Series Films’ Spirit
Spread the love

పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌లతో దూసుకుపోతున్న రెబెల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలసి చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ “స్పిరిట్”. యానిమల్ ఫేం త్రుప్తి డిమ్రీ ఈ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఎంపికైనట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. యానిమల్ చిత్రంలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న త్రుప్తి, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తో మళ్లీ పనిచేయడం పట్ల, అలాగే ప్రభాస్‌తో స్క్రీన్‌ షేర్ చేయడం పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా “స్పిరిట్” ను తొమ్మిది భాషల్లో విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. ఇది పాన్ వరల్డ్ విజన్ ని తెలియజేస్తోంది. భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, మురాద్ ఖేతానీ నిర్మిస్తున్న ఈ చిత్రం, భారత సినిమా చరిత్రలోనే ఒక గొప్ప ప్రాజెక్టుగా నిలవనుంది. రెబెల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది.

Related posts

Leave a Comment