‘షైన్ స్క్రీన్స్’ భారీ సినిమాటిక్ కొలాబరేషన్!

'Shine Screens' is a huge cinematic collaboration!

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, హిట్ మిషన్ అనిల్ రావిపూడి కొలాబరేషన్ లో విజయవంతమైన నిర్మాణ సంస్థ ‘షైన్ స్క్రీన్స్’ ఇటీవల ఒక భారీ సినిమాటిక్ కొలాబరేషన్ ను ప్రకటించింది. భారీ పండుగ వినోదాత్మక చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా 2027 సంక్రాంతికి ఘనంగా విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. ఈ బ్యానర్ ఇప్పటికే ‘భగవంత్ కేసరి’ రీజినల్  బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి వరుస విజయాలను అందించింది. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా, జీ స్టూడియో సహ-నిర్మాతగా చేరింది.  ఎఫ్-2, ఎఫ్-3, సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైనర్‌ల తర్వాత ఇది అనిల్ రావిపూడి వెంకటేష్‌తో కలిసి చేస్తున్న ఐదవ చిత్రం కావడం విశేషం. ఇటివలే…