‘జెట్లీ’ హ్యూమర్, సస్పెన్స్, థ్రిల్ ఉన్న మంచి ఎంటర్‌టైనర్ : డైరెక్టర్ రితేష్ రానా

'Jaitley' is a good entertainer with humor, suspense, and thrill: Director Ritesh Rana
Spread the love

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా ‘జెట్లీ’తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత పెద్దామల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తున్నారు. వెన్నెల కిషోర్, అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ‘జెట్లీ’ మే 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ రితేష్ రానా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
‘జెట్లీ’ జర్నీ ఎప్పుడు మొదలైంది?
-2020లో కోవిడ్ సమయంలో జయేంద్ర అనే రచయితతో కలిసి ఈ కథను డెవలప్ చేశాను. అప్పటి నుంచే ఈ సినిమా చేయాలని అనుకుంటున్నాం. ఫైనల్‌గా గత నవంబర్‌లో ప్రారంభించి, ఇప్పుడు రిలీజ్‌కు తీసుకువస్తున్నాం.
‘జెట్లీ’ని మొదట పెద్ద హీరోతో ఇంటెన్స్ థ్రిల్లర్‌గా చేయాలనుకున్నారట?
-పూర్తిగా థ్రిల్లర్ కాకుండా, కొంత హ్యూమర్ ఉన్న థ్రిల్లర్‌గా చేయాలని అనుకున్నాం. షూటింగ్ మొత్తం ఫ్లైట్‌లోనే జరుగుతుంది. అది ఒక ఎక్స్‌పెరిమెంట్. కొందరితో మాట్లాడినప్పుడు ఈ టైంలో అలాంటి ఎక్స్‌పెరిమెంట్ అవసరమా అనే అభిప్రాయాలు వచ్చాయి. తర్వాత సత్యతో ఈ సినిమా చేయాలని అనిపించింది. ‘మత్తు వదలరా’ తర్వాత నాకు ఆ బడ్జెట్, మార్కెట్ స్కోప్ వచ్చింది. సత్యకి తగ్గట్టు క్యారెక్టర్ మార్చి తెరకెక్కించాం.
సత్యకి కథ చెప్పినప్పుడు ఆయన రియాక్షన్?
-మొదట ఈ కథ చెప్పినప్పుడు ఆయన పాత్ర ఫ్లైట్ అటెండర్. తర్వాత ‘నువ్వే హీరో’ అని చెప్పినప్పుడు షాక్ అయ్యారు. మొదట రిస్క్ అన్నారు. కానీ నేను దీన్ని ఎలా తీస్తానో వివరంగా చెప్పిన తర్వాత చాలా ఎక్సైట్ అయ్యారు. ఆయన క్యారెక్టర్‌లో సీరియస్‌నెస్, హ్యూమర్, సస్పెన్స్.. అన్నీ ఉంటాయి.
‘జెట్లీ’ టైటిల్ జస్టిఫికేషన్?
-‘జెట్లీ’ అనే నటుడు ఉన్నారు. అలాగే కథ జెట్‌లో జరుగుతుంది కాబట్టి ఇంట్రస్టింగ్ గా ఉంటుందని ‘జెట్‌లీ’ అనే టైటిల్ పెట్టాం.
హీరో సత్యా? వెన్నెల కిషోరా?
అది మీరు సినిమా చూసిన తర్వాతే తెలుస్తుంది (నవ్వుతూ).
షూటింగ్ జర్నీ గురించి?
ఈ సినిమా దాదాపు 80% ఫ్లైట్‌లోనే జరుగుతుంది. ఫ్లైట్ సెట్ వేసాం. ఎకానమీ, బిజినెస్ క్లాస్, కార్గో, కాక్పిట్ ఇలా ఒకే ఫ్లోర్‌పై ఐదు సెట్లు వేశాం. నేను తీసిన సినిమాల్లో ఇది చాలా టఫ్ మూవీ. దుబాయ్ నుంచి కొచ్చికి ల్యాండ్ అయ్యే జర్నీలో జరిగే కథ ఇది. యాక్షన్, థ్రిల్, హ్యూమర్..అన్నీ కలిపి మంచి ఎంటర్‌టైనర్.
వెన్నెల కిషోర్ పాత్ర గురించి?
ఈ సినిమా అంతా ఆయన సుడోకు ఆడుతుంటారు. పరిస్థితులకు తగ్గట్టు సినిమా టైటిల్స్ రాస్తుంటారు. చాలా టిపికల్ క్యారెక్టర్.

రియా సింఘా పాత్ర గురించి?

ఇది ఆమె తొలి తెలుగు సినిమా. చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. స్పెషల్ ఏజెంట్ పాత్రలో కనిపిస్తుంది. చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు.
అజయ్ పాత్ర గురించి?
-అజయ్ ప్రజాపతి అనే పాత్రలో కనిపిస్తారు. ఒక బ్యాంక్ స్కామ్ చేసి పారిపోతుంటారు. ఆయన్ని వెనక్కి తీసుకురావడమే కథలో కీలకం.

సత్యతో మీ సింక్ గురించి?

-మా ఇద్దరికీ నాన్ సింక్ ఉంటుంది. ఆ నాన్ సింక్ నుంచే మంచి సింక్ వస్తుంది (నవ్వుతూ). మేమిద్దరం డిఫరెంట్. అదే వర్క్ అవుట్ అవుతుంది.

ప్రొడ్యూసర్ చెర్రీ గారి గురించి?

-ఆయనతో మాత్రం నాకు పర్ఫెక్ట్ సింక్ ఉంటుంది. నా ఎక్స్‌పెరిమెంట్స్‌కి ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. నేను ఒక హీరోతో ప్లాన్ చేసి సడన్‌గా సత్యతో చేస్తానన్నా కూడా నాపై పూర్తి నమ్మకం ఉంచారు.

కాలభైరవ మ్యూజిక్ గురించి?

-నా టెక్నికల్ టీమ్ అంతా నా మొదటి సినిమా నుంచి నాతోనే ఉంది. ఇందులో ఒక సాంగ్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుంది. బిట్ సాంగ్స్ కూడా ఉన్నాయి. సినిమా నిడివి దాదాపు 2 గంటలు 10 నిమిషాలు.
మీ కామెడీ స్టైల్‌పై ఎవరి ప్రభావం?
-చాలామంది ప్రభావం ఉంటుంది. క్రేజీ మోహన్ గారి కామెడీ స్టైల్ నాకు చాలా ఇష్టం. అలాగే సెటైర్, సర్కాసం కూడా ఇష్టం. హాలీవుడ్ కామెడీని కూడా ఇష్టపడతాను.
ఈ సినిమాలో చిరంజీవి గారి రిఫరెన్స్ ఉందా?
-సినిమా చిరంజీవి గారి ఫ్రేమ్‌తోనే ప్రారంభమవుతుంది. నా గత సినిమాల్లో కూడా ఆయన రిఫరెన్స్ ఉంటుంది. ఇదీ అలాగే కొనసాగింది.
మీ ప్రమోషన్స్ చాలా యూనిక్ గా వుంటాయి కదా?
-ఈ రోజుల్లో ప్రమోషన్స్ చాలా ముఖ్యం షూటింగ్ సమయంలోనే ప్లాన్ చేస్తాను. ఈ సినిమాకి కూడా అలానే ప్లాన్ చేశాను.
టఫ్ సీక్వెన్సులు?
-ఇందులో రెండు కీలక సీక్వెన్సులు ఉన్నాయి. వాటి సీజీకి నాలుగు నెలలు పట్టింది. మొదట అవే షూట్ చేసి, మిగతా టైమ్ సీజీకి వాడుకున్నాం. అవి చాలా స్టైలిష్‌గా ఉంటాయి.

సీక్వెల్ అవకాశం ఉందా?

-ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సినిమా వర్కౌట్ అయితే సీక్వెల్‌కు మంచి స్కోప్ ఉంది.

మీకు ఇష్టమైన జానర్?

-నాకు హారర్ జానర్ చాలా ఇష్టం. తర్వాత చేయబోయేది హారర్ సినిమానే. ఇది కొత్తవాళ్లతో చేసే అవకాశం ఉంది.
ఆల్ ది బెస్ట్
-థాంక్యూ

Related posts