ఎస్వీ కృష్ణారెడ్డి ‘వేదవ్యాస్’ బ్యానర్ ఆవిష్కరణ

SV Krishna Reddy unveils 'Vedavyas' banner

కొత్తగా చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించే ప్రతి సంస్థ తమ బ్యానర్ రూపకల్పనలో ప్రత్యేక  శ్రద్ధను  కనపరుస్తుంది. తమ బ్యానర్ కు సంబంధించిన లోగోను, టైటిల్ ను చాలా ఆర్టిస్ట్ గా రూపొందించుకునేందుకు ప్రయత్నిస్తారు సదరు నిర్మాణ సంస్థ అధినేతలు . అలాగే బ్యానర్ అనౌన్స్మెంట్ కు  ముందు సెంటిమెంటల్ గా దైవ దర్శనం చేసుకుని లోగో ప్రతులను దేవుడి ముందు ఉంచి  భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు . కాగా  ప్రస్తుత విషయానికి వస్తే ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె . అచ్చిరెడ్డి సమర్పణలో నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ‘వేదవ్యాస్’ చిత్రం బ్యానర్ ఆవిష్కరణ ఫిలింనగర్ లోని సాయిబాబా దేవాలయంలో శాస్త్రోక్తంగా జరిగింది. మాజీ శాసనసభ్యులు,   కె . పి. ఆర్. ఐటీ విద్యాసంస్థల అధినేత, బిజినెస్ మ్యాన్…

స్పెషల్ స్టోరీ… తెలుగు సినిమాకు పూర్ణోదయ వెలుగులు

Special story... The dawn of Telugu cinema

* ఏప్రిల్24 ఉత్తమ చిత్రాల నిర్మాత ఏడిద నాగేశ్వరావు 92 వ జయంతి శంకరాభరణం, సీతాకోకచిలక, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి చిత్రాలంటే పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ గుర్తుకువస్తుంది. కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ చలనచిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు . ఉత్తమాభిరుచి గల నిర్మాత.. తెలుగు సినిమా కీర్తిని జాతీయ స్థాయిలో నిలిపిన నిర్మాత, తెలుగు సినిమాకు పూర్ణోదయ వెలుగులు పంచిన ఏడిద నాగేశ్వరరావు 92 వ జయంతి నేడు. నటన మీద మక్కువతో.. నాటకాల్లో నటుడిగా, అనంతరం సినీనటుడిగా,తన సినీ ప్రస్థానం ప్రారంభించారు. సినీచిత్ర నిర్మాణరంగంపై దృష్టి సారించి 1976లో స్నేహితులతో కలిసి మొదటి ప్రయత్నంగా ‘సిరిసిరిమువ్వ ‘ చిత్రాన్ని నిర్మాణ నిర్వాహకుడిగా నిర్మించారు. హిరోయిన్ జయప్రద మూగది, హీరో చంద్రమోహన్ డప్పు కొట్టుకునేవాడు. పెద్ద తారాగణమేమీ లేదు. అందరూ పెదవి…

జేడీ చక్రవర్తి ఇంటర్వ్యూ…కథ నచ్చితేనే చేస్తా

JD Chakravarthy interview...I'll do it only if I like the story

*’గాయపడ్డ సింహం’లో చేసిన ధర్మా క్యారెక్టర్ నటుడిగా ఆనందాన్ని ఇచ్చింది డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. గాయపడ్డ సింహం మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా యాక్టర్ జేడి చక్రవర్తితో ఇంటర్వ్యూ.. ఆ వివరాలు ఆయన మాటల్లోనే… * ‘గాయపడ్డ సింహం’లో ధర్మా పాత్ర చేయడానికి ఆకర్షించిన అంశం…

MRP టీజర్ విడుదల – నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా ఆవిష్కరణ

MRP Teaser Released – Launched by Producer Sahu Garapati

ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా ఈ టీజర్ విడుదల కావడం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. టీజర్ విడుదల చేసిన అనంతరం టీం అందరికి విషెస్ చెప్తూ మూవీ సక్సెస్ కావాలి, అని అన్నారు. పాంచజన్య ఫీచర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ చూస్తే వినోదంతో నిండిన వినూత్న కథను చూపించబోతుందనే భావన కలుగుతోంది. ముగ్గురు యువకుల చుట్టూ తిరిగే కథ, వారి మధ్య ఉండే సరదా సంఘటనలు, స్టైలిష్ మేకింగ్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ చిత్రానికి శ్రవణ్ జేష్ఠ దర్శకత్వం వహిస్తూ నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. టీజర్‌లో కనిపించిన ఎనర్జీ, ప్రెజెంటేషన్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. సంగీతాన్ని అజయ్ అరసాడ అందించగా, విజువల్స్‌కి మరింత ఆకర్షణను…