మ్యూజికల్ ఫాంటసీ : ‘సింగ్ గీతం’ జూన్ 11న రిలీజ్

Musical fantasy: 'Sing Geetam' to release on June 11th

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు. దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్‌లో, పలు భాషల్లో దాదాపు అరవై చిత్రాలతో ఇండియన్ సినిమాని రీడిఫైన్ చేసిన సంగీతం, 94 ఏళ్ల వయసులో డైరెక్టర్ చైర్ లోకి తిరిగి వస్తూ, సృజనాత్మకతకు హద్దులు లేవని మరోసారి నిరూపిస్తున్నారు.  ఐకానిక్ మూకీ చిత్రం ‘పుష్పక్’ నుంచి  విజనరీ సైన్స్ ఫిక్షన్ క్లాసిక్ ‘ఆదిత్య 369’ వరకు ఆయన క్రియేటివిటీకి పర్యాయపదంగా నిలిచారు. కమల్ హాసన్‌తో ఆయన చేసిన ‘విచిత్ర సహోదరులు’,  ‘మైఖేల్ మదన కామరాజన్’ బెంచ్ మార్క్ సినిమాలుగా నిలిచాయి. ఇప్పుడు, భారతదేశపు మొట్టమొదటి మ్యూజికల్ ఫాంటసీగా రూపొందించిన ‘సింగ్ గీతం’తో అలరించబోతున్నారు. ఈ చిత్రం సంగీతం, మ్యాజికల్ రియలిజంను మేళవించి ఓ యూనిక్ అనుభూతిని అందిస్తుంది. వైజయంతి మూవీస్, స్వప్న…

శ్రీనిధి శెట్టి : పాన్ ఇండియా బ్యూటీ…

Srinidhi Shetty: Pan India Beauty...

‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి ఓ నటిగా అన్ని రకాల జానర్‌ సినిమాలు చేయాలనుకుంటోంది. యశ్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్‌తోనూ అభిమానులను ఆకట్టుకుంది. ‘కేజీఎఫ్’ తర్వాత నాని హీరోగా వచ్చిన ‘హిట్ -3’లో కనిపించింది. ఇటీవల ఓ సందర్భంలో రణ్‌బీర్ కపూర్‌, సాయి పల్లవి జంటగా వస్తోన్న రామాయణ చిత్రంలో ఛాన్స్‌ గురించి క్లారిటీ ఇచ్చింది. సీతగా సాయి పల్లవి చేస్తోన్న రోల్‌ను రిజెక్ట్‌ చేశానన్న వార్తలపై స్పందించింది. ఆడిషన్‌కు వెళ్లిన మాట నిజమే కానీ.. తాను ఆ పాత్రకు ఎంపిక కాలేదని తెలిపింది. సీత రోల్‌కు ఎవరైతే సెట్‌ అవుతారో నిర్మాతలు డిసైడ్‌ చేశారని వెల్లడించింది. ఆ మూవీ ఆడిషన్‌కు వెళ్లడమే తనకు గొప్ప గౌరవమని ఆనందం వ్యక్తం చేసింది. అంత పెద్ద రోల్‌కు నేను ఆడిషన్…