సుప్రీమ్ హీరో సాయి తేజ్ కొత్త చిత్రం ప్రారంభం

SaiTej New Movie Opening

సుప్రీమ్ హీరో సాయి తేజ్ క‌థానాయ‌కుడిగా ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన‌ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌ ఎల్ఎల్‌పీ బ్యాన‌ర్‌పై బాపినీడు స‌మ‌ర్ప‌ణ‌లో సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాత‌గా కొత్త చిత్రం ప్రారంభమైంది. జ‌యంత్ పానుగంటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమవుతున్నారు. ఈ సందర్బంగా జరిగిన ముహూర్త‌పు స‌న్నివేశానికి నిర్మాత బాపినీడు భోగ‌వ‌ల్లి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హీరో సాయి తేజ్ క్లాప్ కొట్టారు. హీరో సాయి తేజ్ అమ్మ‌గారు విజ‌య దుర్గ‌, నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌తీమ‌ణి విజ‌య ల‌క్ష్మి పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. బుచ్చి బాబు సానా స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా నిర్మాత‌ బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ గారు మాట్లాడుతూ ‘‘సాయి తేజ్‌తో మా నిర్మాణ సంస్థ‌కు ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉంది. అదే అనుబంధంతో ఇప్పుడు ఆయ‌న మా…