Sabdham Movie Review In Telugu : ‘శబ్దం’ మూవీ రివ్యూ : ఫర్వాలేదనిపించే హారర్ రివేంజ్ డ్రామా!

Sabdham Movie Review In Telugu :

దర్శకుడు అరివళగన్ దర్శకత్వంలో ఆది పినిశెట్టి హీరోగా వచ్చిన చిత్రం ‘శబ్దం’. ఈ చిత్రం నేడు (28, ఫిబ్రవరి -2025) విడుదలయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం… కథ : వరుసగా హోలీ ఏంజెల్ కళాశాలలో విద్యార్థులు చనిపోతూ ఉంటారు. ఆ చావులతో కాలేజీలో దెయ్యాలు ఉన్నాయనే రూమర్ జోరుగా వినిపిస్తుంది. దీంతో కాలేజీ యాజమాన్యం ఈ కేసుని డీల్ చేసేందుకు ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ వ్యోమ వైద్యలింగం (ఆది పినిశెట్టి)ని పిలుస్తారు. అతడు వ్యోమా కాలేజీలో అడుగు పెట్టి అసలు విషయాన్ని కనిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరోవైపు అదే కాలేజీలో అవంతిక (లక్ష్మీ మీనన్) అసలు ఈ దెయ్యాలు, ఆత్మలు అనేవి లేవనే థీసిస్ చేస్తూ ఉంటుంది. కానీ, అవంతిక ప్రవర్తనలో తేడాను వ్యోమ కనిపెడతాడు. ఈ క్రమంలో జరిగిన…