కరోనా కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం? క్వశ్చన్ మార్క్. హీరోయిన్ ఓరియెంటెడ్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆదాశర్మ మెయిన్ లీడ్ లో నటించింది. సంజయ్, అభయ్, భానుశ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై విప్రా దర్శకత్వం లో గౌరీ కృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆఖరి దశలో ఉన్నాయి. ఇటీవల మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా లాంచ్ చేసిన పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఈ చిత్రంలోని పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా నిర్మాత గౌరీ కృష్ణ మాట్లాడుతూ “మా శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై ఆదా శర్మ హీరోయిన్…