వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ బ్యానర్స్ పై సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్, శృతీ సోధిలు హీరోహీరోయిన్లుగా ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్న వినోద్ విజయన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. వినోద్ విజయన్, గార్లపాటి రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని మార్చి లో థియేటర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు వినోద్ విజయన్ మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ థ్రిల్లర్ సినిమాలో హీరో సాయిరామ్ శంకర్ విభిన్నమైన, పవర్ ఫుల్ అడ్వకేట్ పాత్రలో కనిపిస్తారు. సముద్రఖని పోలీస్ ఆఫీసర్ పాత్రలో అత్యద్భుతంగా నటించారు. గోపిసుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. రాహుల్ రాజ్ అద్భుతమైన రెండు పాటలు అందించగా, సిధ్ శ్రీరాం…
