సినిమా కూడా సీరియస్ సాహిత్యమే అంటున్న ప్రసేన్ @సినిమా!

Prasen @cinema says that the movie is also serious literature!

ఆధునిక యుగంలో తెలుగులో చెప్పుకోదగ్గ సినిమా విమర్శ లేదు. అందుకు కారణం సీరియస్ విమర్శకులు సినిమాను విశ్లేషించాల్సిన పదార్ధంగా భావించక చులకనగా చూడడమే. కత్తి మహేష్, చల్లా శ్రీనివాస్, సికిందర్, ప్రసేన్, అండ్ యువర్స్ ఒబీడియంట్లి మాత్రమే తరచుగా విరివిగా రాసారు. అయితే వీళ్ళలో తమ విమర్శకు పుస్తక రూపం ఇచ్చిన వాళ్ళు తక్కువ. ఇప్పుడు ప్రసేన్ తన సినీ విమర్శ నంతటినీ ఒక్క చోట చేర్చి ప్రసేన్ @సినిమా పేరుతో పుస్తకంగా మన ముందుంచాడు. గత పదేళ్లలో విడుదలైన సినిమాలలో 125 కు పైగా సినిమాలకు సంబందించిన విశ్లేషణలు ఈ పుస్తకంలో ఉన్నాయి. సినిమాను పొగిడారా తెగిడారా అనే విషయాన్ని పక్కకు పెడితే ఏం చేసినా ప్రసేన్ రాత మాత్రం ఆసక్తిని రేకేత్తించేదిగా ఉంది. పాఠకుడిని ఉత్కంఠ లో ముంచెత్తుతు సమీక్షలను ఉరుకులు పెట్టించాడు. కొన్ని…