* ఏ కష్టానికి కుంగిపోని లెజెండరీ సింగర్ ఆస్తులు ఎంతంటే?
తీరాన్ని అలలు తాకినట్లు ఆమె జీవితాన్ని కష్టాలు వెన్నంటాయి.. టీనేజ్లోనే ప్రేమ వివాహం.. గర్భిణిగా ఉన్న సమయంలో భర్త దూరం కావడంతో.. ఒక దశలో ఆత్మహత్యకు యత్నించినా.. ఆమె గానామృతాన్ని ఆస్వాదించే అదృష్టం ప్రపంచానికి ఉండటంతో మృత్యువును తప్పించుకొన్నారు. ‘దమ్ మారో దమ్’ అంటూ పాడి సంగీతాభిమానులను ఓలలాడించారు. 14 భాషల్లో వేలాది పాటలతో భారత చిత్రపరిశ్రమను అలరించారు. ఆమే ఆశా భోంస్లే..! మహారాష్ట్రలోని సాంగ్లీలో కళాకారుల కుటుంబంలో 1933 సెప్టెంబర్ 8న జన్మించింది ఆశా. తండ్రి దీననాథ్ మంగేష్కర్ థియేటర్ ఆర్టిస్ట్. అక్క లతా మంగేష్కర్. ఉమా, మీనా అక్కాచెల్లెళ్లు, హృదయనాథ్ సోదరుడు. ఆశా 9 ఏళ్ల వయస్సులోనే తండ్రిని కోల్పోయింది. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొనేందుకు అక్క లతా మంగేష్కర్తో కలిసి పాటలు పాడింది. క్లాసికల్, గజల్స్, రొమాంటిక్ ఇలా అన్ని రకాల పాటలను అలవోకగా పాడగలగడం ఆమెకు దేవుడిచ్చిన వరం. ఆమె 12,000కుపై పాటలతో భారతీయ చిత్ర పరిశ్రమపై చెరగని ముద్రవేశారు. ఆశా భోంస్లే నికర ఆస్తి విలువ సుమారు రూ. 200-250 కోట్లు ఉంటుందని అంచనా. తన 8 దశాబ్దాల సుదీర్ఘ గాన ప్రస్థానంలో ఆమె ఈ సంపదను కూడబెట్టారు. ఎక్కువగా స్థిరాస్థులు, వ్యాపారాలపై ఆమె ఎక్కువగా పెట్టుబడి పెట్టారట. ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో సూపర్ హిట్ పాటలను అందించారు. ఆశా భోంస్లే కేవలం పాడటమే కాదు, తన వంట ప్యాషన్‌ను కూడా బిజినెస్‌గా మార్చారు. ‘ఆశాస్’ పేరుతో ఆమె ఒక రెస్టారెంట్ చైన్‌ను ప్రారంభించారు. ఇది దుబాయ్, యూకే, గల్ఫ్ దేశాల్లో విస్తరించి ఉంది. దీని ద్వారా కూడా ఆమెకు భారీగా ఆదాయం వస్తుంది. పాటలతోపాటు నిరంతరంగా ఆమెకి ఈ ఆదాయం వస్తుంది. ఆశా భోంస్లేకు ముంబై, పుణె నగరాల్లో పలు విలాసవంతమైన బంగ్లాలు ఉన్నాయి. వాటి మొత్తం విలువ సుమారు రూ. 80-100 కోట్లు ఉంటుందని అంచనా. ఆమె లైఫ్ స్టయిల్ కూడా అంతే లగ్జరీగా ఉంటుంది. ఆశా భోంస్లే తన కెరీర్లో ప్రపంచవ్యాప్తంగా లైవ్ కాన్సర్ట్‌లు చేశారు. దుబాయ్, అమెరికా, కెనడా, ట్రినిడాడ్ వంటి దేశాల్లో ఆమె చేసిన షోలు లక్షలాది మంది అభిమానులను ఉర్రూతలూగించాయి. ఆమె గాత్రం మ్యాజిక్ ప్రతిచోటా వ్యాపించింది.
