న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మించిన సినిమా “తిమ్మరాజుపల్లి టీవీ”. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా నటించారు. “తిమ్మరాజుపల్లి టీవీ” చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్నిసొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సక్సెస్ మీట్ నిర్వహించారు. నిర్మాత కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – మా సినిమాకు మీడియా నుంచి వస్తున్న రెస్పాన్స్, ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ ఆడియెన్స్ మూవీకి బాగా కనెక్ట్ అవుతున్నారు. కొత్త వాళ్లంతా చేసిన సినిమా, మంచి అటెంప్ట్ చేశారు, మీరు మిస్ కాకుండా ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్ కు వెళ్లండి. వీళ్లను ఆదరించాలని కోరుతున్నా అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ మాచర్ల, డైరెక్టర్ వి.మునిరాజు, హీరోయిన్ వేద జలంధర్, డీవోపీ అక్షయ్ రామ్ పొదిశెట్టి, హీరో సాయి తేజ్ పాల్గొని మాట్లాడారు.
‘తిమ్మరాజుపల్లి టీవీ’కి ఆదరణ : సక్సెస్ మీట్ లో నిర్మాత కిరణ్ అబ్బవరం
